త్వరలో టీమ్ఇండియాతో జరగబోయే టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్. కోహ్లీసేనతో మ్యాచ్ అంటే అద్భుతంగా ఉంటుందని వెల్లడించాడు.
"టీమ్ఇండియాతో ప్రతి మ్యాచ్ అద్భుతమైన ఛాలెంజ్. వారితో మ్యాచ్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాం. ఫైనల్‌కు అర్హత సాధించడం గొప్పగా అనిపిస్తోంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే ఇంకా బాగుంటుంది. టెస్టు ఛాంపియన్ షిప్లో సిరీస్‌లు చాలా ఉత్కంఠగా జరిగాయి. ఆస్ట్రేలియా-భారత్ సిరీస్ అయినా లేక పాకిస్థాన్ మా సిరీస్ అయినా చాలా బాగా జరిగాయి."
-విలియమ్సన్, న్యూజిలాండ్ కెప్టెన్
రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడేందుకు ఇప్పటికే ఇంగ్లాండ్ చేరుకుంది న్యూజిలాండ్ జట్టు. జూన్ 2న ఈ సిరీస్ ప్రారంభం కానుంది. దీనిని టెస్టు ఛాంపియన్ షిప్‌కు సన్నాహకంగా భావిస్తోంది కివీస్. జూన్ 18న ఛాంపియన్ షిప్ ఫైనల్ ప్రారంభమవుతుంది. ఇందుకోసం జూన్ మొదటి వారంలో ఇంగ్లాండ్ బయలుదేరనుంది టీమ్ఇండియా.