ETV Bharat / sports

'కోహ్లీ, రోహిత్​ కూడా బౌలింగ్ చేయాలి'

ఆల్​రౌండర్లపై టీమ్​ఇండియా మరింత శ్రద్ధ వహించాలని సూచించాడు భారత జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్(kapil Dev News). విరాట్​, రోహిత్​ కూడా అప్పుడప్పుడు బౌలింగ్ చేయాలని, టీ20ల్లో అది అవసరమని తెలిపాడు.

kapil dev
కపిల్ దేవ్
author img

By

Published : Sep 10, 2021, 9:35 AM IST

టీ20 జట్టులో ఆల్​రౌండర్లు కీలక పాత్ర పోషిస్తారని టీమ్​ఇండియా మాజీ సారథి కపిల్ దేవ్(Kapil Dev All Rounder )​ అన్నాడు. ఆల్​రౌండర్లపై భారత జట్టు మరింత శ్రద్ధ వహించాలని సూచించాడు. ప్రస్తుతం భారత జట్టులో గొప్ప నైపుణ్యం ఉన్న ఆటగాళ్లున్నారని ప్రశంసించాడు. అయితే.. బ్యాటింగే కాకుండా బౌలింగ్​ చేయడానికీ ప్రయత్నించాలని.. కీలక సమయాల్లో అది ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డాడు.

"ఒకవేళ ఓ ఆటగాడికి గాయమైతే.. టీమ్​ వేరే ఆటగాడితో సరిపెట్టుకుంటుంది. కానీ, ఆల్​రౌండర్లు ఇద్దరూ గాయపడితే.. చాలా ఇబ్బందులు ఎదుర్కోవాలి. ఇలాంటి సమస్యలు రాకుండా బ్యాటింగ్ ఆల్​రౌండర్ ఒకరు, బౌలింగ్ ఆల్​రౌండర్ ఒకరు జట్టులో ఉండటం చాలా మంచిదని నా అభిప్రాయం. సచిన్ తెందుల్కర్, సౌరవ్ గంగూలీ బ్యాట్స్​మెన్. కానీ, వాళ్లు క్లిష్ట పరిస్థితుల్లో బౌలింగ్ కూడా చేయగలరు. విరాట్, రోహిత్​ మాత్రం అసలు బౌలింగ్ చేయడం లేదు. టీ20లో ఇలా ఉండకూడదు. ప్రతి ఒక్కరు కొన్ని ఓవర్లైనా వేయడానికి ప్రయత్నించాలి."

-కపిల్ దేవ్, టీమ్​ఇండియా మాజీ కెప్టెన్.

టీ20లో ఇద్దరు ఆల్​రౌండర్​లు ఉంటడం చాలా ముఖ్యమని చెప్పిన కపిల్​ దేవ్​.. హార్ధిక్​ పాండ్య(Hardik Pandya News) మెరుగైన బ్యాటింగ్​ ఆల్​రౌండర్​ అని తెలిపాడు. బ్యాటింగ్, బౌలింగ్​ ఆల్​రౌండర్లు ఇద్దరూ ఉంటే టీమ్​ బాధ్యత వహించేందుకు మరో ఇద్దరు ఎక్స్​ట్రా ఆటగాళ్లు జట్టులో ఉన్నట్లు అవుతుందని పేర్కొన్నాడు. ఒకే ఆల్​రౌండర్​ ఉంటే కెప్టెన్​కు ఇక్కట్లు తప్పవని అభిప్రాయపడ్డాడు.

ప్రస్తుతం టీమ్​ఇండియాలో(Team India All Rounder) హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కృనాల్ పాండ్యా ఆల్​రౌండర్లుగా రాణిస్తున్నారు. వీరితో పాటు మరికొందరు ఆటగాళ్లు కూడా బౌలింగ్​, బ్యాటింగ్​లో మెప్పిస్తున్నారు.

ఇదీ చదవండి:'అనుకోకుండా ఆల్‌రౌండర్‌గా మారా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.