ETV Bharat / sports

ఇంగ్లాండ్​ ఆల్​రౌండ్​ ప్రదర్శన.. భారత్​కు తప్పని ఓటమి - ఇండియా vs ఇంగ్లాండ్​ తొలి టీ20

అహ్మదాబాద్​ వేదికగా ఇంగ్లాండ్​తో జరిగిన తొలి టీ20లో టీమ్ఇండియా ఓటమి పాలైంది. ఇంగ్లాండ్​ బౌలర్లు, బ్యాట్స్​మెన్​ ఆల్​రౌండ్​ ప్రదర్శనతో ఆకట్టుకున్న వేళ.. కోహ్లీసేనపై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

India Vs England 1st T20I: England beat India By 8 Wickets
ఇంగ్లాండ్​ Vs ఇండియా
author img

By

Published : Mar 12, 2021, 10:13 PM IST

టీమ్ఇండియాతో ఇటీవలే జరిగిన టెస్టు సిరీస్​లో ఓడిపోయిన ఇంగ్లాండ్ టీమ్​.. టీ20 సిరీస్​లోని తొలి మ్యాచ్​లో విజయాన్ని నమోదు చేసింది. టాస్​ గెలిచి ఫీల్డింగ్​ ఎంచుకున్న మోర్గాన్​ సేన.. భారత్​ను తక్కువ పరుగులకే పరిమితం చేసింది. ఆ తర్వాత బరిలో దిగిన ఇంగ్లిష్​ బ్యాట్స్​మెన్​.. ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతూ.. 125 పరుగులే లక్ష్యాన్ని 15.3 ఓవర్లలో ఛేదించారు.

ఓపెనర్​ జేసన్​ రాయ్​ (49) అర్ధశతకం వరకు వచ్చి వాషింగ్టన్​ సుందర్​ బౌలింగ్​లో ఎల్బీగా వెనుదిరిగాడు. అంతకుముందు జోస్​ బట్లర్​(28) చాహల్​ బౌలింగ్​లో ఔట్​ అయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్​కు వచ్చిన డేవిడ్​ మలన్(24)​, జానీ బెయిర్​స్టో(26) నిలకడగా ఆడుతూ.. తమ జట్టుకు విజయాన్ని అందించారు. ఓవర్లలోనే ఇంగ్లాండ్​ జట్టు లక్ష్యాన్ని ఛేదించింది. ఫలితంగా 8 వికెట్ల తేడాతో కోహ్లీసేనపై ఘనవిజయం సాధించింది.

అంతకుముందు టాస్​ ఓడి బ్యాటింగ్​ చేసిన టీమ్ఇండియా 20 ఓవర్లకు 7 వికెట్ల నష్టానికి 124 పరుగులే చేసింది. ఇంగ్లిష్‌ పేసర్ల ధాటికి కోహ్లీసేన విలవిల్లాడింది. శ్రేయస్‌ అయ్యర్‌ (67; 48 బంతుల్లో 8×4, 1×6) మాత్రమే అర్ధశతకంతో రాణించాడు. కానీ, ఆఖరి ఓవర్లో ఔటయ్యాడు. రిషభ్ పంత్‌ (21; 23 బంతుల్లో 2×4, 1×6) కాసేపు అలరించాడు. ఆర్చర్‌ బౌలింగ్‌లో రివర్స్‌స్వీప్‌తో సిక్సర్‌ బాది అదరగొట్టాడు. హార్దిక్‌ పాండ్య (19; 21 బంతుల్లో 1×4, 1×6) సైతం కొంత సమయం అయ్యర్‌కు అండగా నిలిచాడు. ఇంగ్లాండ్ ఐదుగురు పేసర్లు, ఒక స్పిన్నర్‌ను ప్రయోగించింది. ఆర్చర్‌ 3 వికెట్లు తీశాడు.

ఇదీ చూడండి: తొలి టీ20లో తడబడిన భారత్​.. ఇంగ్లాండ్​ లక్ష్యం 125

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.