ETV Bharat / sports

Eng vs Ind: ఇంగ్లాండ్​  303 ఆలౌట్​.. భారత లక్ష్యం 209

భారత్​తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్​లో ఇంగ్లాండ్​ 303 పరుగులకు ఆలౌటైంది. కోహ్లీ సేన ముందు 209 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది రూట్​ సేన. టీమ్ఇండియా బౌలర్లలో బుమ్రా 5, సిరాజ్​ 2, ఠాకుర్​ 2 వికెట్లతో రాణించారు. ఆతిథ్య జట్టులో కెప్టెన్​ రూట్​ సెంచరీ చేశాడు.

India vs england
ఇండియా vs ఇంగ్లాండ్
author img

By

Published : Aug 7, 2021, 10:21 PM IST

Updated : Aug 7, 2021, 10:49 PM IST

నాటింగ్​హామ్​ టెస్టు రెండో ఇన్నింగ్స్​లో ఇంగ్లాండ్​ 303 పరుగులకు ఆలౌటైంది. కోహ్లీ సేన ముందు 209 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. టీమ్ఇండియా బౌలర్లలో బుమ్రా 5 వికెట్లతో మెరిశాడు. సిరాజ్​, ఠాకుర్​ తలో రెండు వికెట్లు తీశారు.

235/5తో టీ విరామానికి వెళ్లిన ఇంగ్లాండ్​ మరో 68 పరుగులు చేసి రెండో ఇన్నింగ్స్​లో ఆలౌటైంది. కెప్టెన్​ జో రూట్​ సుదీర్ఘ ఫార్మాట్​లో 21వ శతకాన్ని నమోదు చేశాడు. కాసేపటికే జోస్​ బట్లర్​ను ఠాకుర్​ వెనక్కి పంపాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన సామ్ కరన్​ దూకుడుగా ఆడాడు. సారథి రూట్​తో కలిసి ఏడో వికెట్​కు 37 పరుగులు జోడించాడు. కుదురుకుంటున్న ఈ జోడిని బుమ్రా విడదీశాడు. తర్వాత వచ్చిన వారెవరూ అంతగా ఆకట్టుకోలేకపోయారు. దీంతో 303 పరుగుల వద్ద ఆతిథ్య టీమ్​ ఇన్నింగ్స్​కు తెరపడింది.

Last Updated : Aug 7, 2021, 10:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.