బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో ఓపెనింగ్ బ్యాటర్ శిఖర్ ధావన్ సరైన ప్రదర్శన చేయలేకపోయిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌లో అతడు కేవలం 7,8, 3 స్కోరుకు మాత్రమే పరిమితమయ్యాడు. అయితే ఇదే సిరీస్‌లో రోహిత్ స్థానంలో వచ్చిన ఇషాన్ కిషన్ ద్విశతకంతో చెలరేగాడు. ఈ నేపథ్యంలో ధావన్ వన్డే కెరీర్‌పై వికెట్‌కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
"శ్రీలంకతో జరగనున్న సిరీస్‌లో ధావన్‌కు ఏ స్థానం ఇస్తారు? ఇషాన్ కిషన్ వంటి ఆటగాడిని ఎలా తప్పిస్తారు? అదెలా చేస్తారనేది ఆసక్తికరం. శుభ్‌మన్ గిల్ సైతం అద్భుతంగా ఆడుతున్నాడు. రోహిత్ అందుబాటులోకి వస్తే ఎవరో ఒకరు జట్టుకు దూరం కావాల్సి ఉంటుంది. నాకు తెలిసి అది ధావనే అవుతాడు. అదే జరిగితే.. అతడి అద్భుతమైన కెరీర్‌కు బాధాకరమైన ముగింపు తప్పదేమో. అయితే, ఈ విషయంలో సెలక్టర్లు స్పందించాల్సి ఉంది" అని డీకే తెలిపాడు.
కాగా, భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్ 2023 ముంగిట తుది జట్టులో శిఖర్ ధావన్‌కు చోటు దక్కడం కష్టమేనంటూ డీకే పేర్కొన్నాడు. "శుభ్‌మన్ గిల్ జట్టులో ఉంటే కచ్చితంగా ఓపెనర్‌గా ఆడతాడు. ఎందుకంటే, కొంతకాలంగా అతడు అద్భుతంగా ఆడుతున్నాడు. ఇక ఇషాన్ కిషన్ తనకు లభించిన అవకాశాన్ని రెండు చేతులతో ఒడిసిపట్టాడు. గొప్పగా రాణించాడు. ఈ రెండు అంశాలు శిఖర్ ధావన్‌కు అవకాశాలను దూరం చేయొచ్చు" అని వివరించాడు. ఇకపోతే ధావన్ ఇప్పటివరకూ కేవలం వన్డేల్లోనే ఆడుతున్నాడు. టీ20లు, టెస్టు మ్యాచ్‌ల్లో మాత్రం సెలక్టర్లు ఇతడిని దూరం పెడుతూ వస్తున్నారు.
ఇదీ చూడండి: అమ్మాయిలు అదుర్స్.. ఆస్ట్రేలియాపై 'సూపర్' విక్టరీ.. అదరగొట్టిన స్మృతి, రిచా