ETV Bharat / sports

సెంచరీకి ముందు రోజు రాత్రి సరిగా నిద్ర పట్టలేదు: శ్రేయస్ - శ్రేయస్ అయ్యర్ సునీల్ గావస్కర్

Shreyas Iyer Century in Test: టీమ్ఇండియా యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ న్యూజిలాండ్​తో జరుగుతోన్న తొలి టెస్టులో సెంచరీతో మెరిశాడు. ఇదే ఇతడికి తొలి టెస్టు మ్యాచ్ కావడం గమనార్హం. ఈ మ్యాచ్​కు ముందు దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ ద్వారా తన టెస్టు క్యాప్ అందుకున్నాడు శ్రేయస్. ఈ విషయంపై స్పందిస్తూ.. అదెంతో గర్వకారణమని అన్నాడు.

Shreyas Iyer
శ్రేయస్ అయ్యర్
author img

By

Published : Nov 27, 2021, 5:32 AM IST

Updated : Nov 27, 2021, 6:57 AM IST

Shreyas Iyer Century in Test: టీమ్‌ఇండియా యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్‌ కాన్పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతోన్న తొలి టెస్టుతో సుదీర్ఘ ఫార్మాట్​లో అరంగేట్రం చేశాడు. భారత మాజీ దిగ్గజ ఆటగాడు సునీల్ గావస్కర్‌ చేతుల మీదుగా క్యాప్‌ అందుకున్న అతడు ఘనంగా టెస్టు కెరీర్‌ను ఆరంభించాడు. రెండో రోజు ఆట ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన అయ్యర్‌.. గావస్కర్‌ చెప్పిన సలహా ఏంటో బయట పెట్టేశాడు.

"క్యాప్ అందిస్తున్న సమయంలో సునీల్ గావస్కర్‌(Shreyas Iyer Sunil Gavaskar) సర్‌ నన్ను చాలా మోటివేట్ చేశారు. భవిష్యత్‌ గురించి ఎక్కువగా ఆలోచించకుండా.. ఆటను ఎంజాయ్‌ చేయమని చెప్పారు. తొలుత రాహుల్ ద్రవిడ్‌ సర్‌ టెస్టు క్యాప్‌ అందిస్తారేమో అనుకున్నా. అయితే, నేను ఊహించని విధంగా గావస్కర్ సర్‌ క్యాప్‌ అందించారు. ఇద్దరూ దిగ్గజ క్రికెటర్లే. ఇద్దరిలో ఎవరు క్యాప్ అందించినా గర్వకారణమే. తొలి రోజు నా ఆట తీరు పట్ల పూర్తి సంతోషంగా ఉన్నాను. ఓవర్‌ నైట్‌ బ్యాటర్‌గా తొలి రోజు ఆట ముగించడం వల్ల.. ఆ రోజు రాత్రంతా సరిగా నిద్ర పట్టలేదు. తెల్లవారుజామున 5 గంటలకే లేచాను. సెంచరీ చేసిన తర్వాత కొంచెం కుదుటపడ్డాను. ఆ అనుభూతి మరిచిపోలేనిది."

-శ్రేయస్ అయ్యర్, టీమ్ఇండియా క్రికెటర్

సచిన్‌ ప్రశంసలు..

Sachin about Shreyas Iyer: కాగా, అరంగేట్ర టెస్టులోనే శతకంతో ఆకట్టుకున్న శ్రేయస్‌ అయ్యర్‌పై భారత దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ తెందూల్కర్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. "టెస్టు కెరీర్‌ను గొప్పగా ప్రారంభించావు శ్రేయస్‌ అయ్యర్‌. టీమ్‌ఇండియా టెస్టు క్రికెట్ జట్టులో నువ్వు కూడా భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది" అని సచిన్‌ ట్వీట్‌ చేశాడు.

టీమ్‌ఇండియా తరఫున అరంగేట్ర టెస్టులోనే శతకం బాదిన 16వ ఆటగాడిగా అయ్యర్‌ నిలిచాడు. రోహిత్‌ శర్మ, పృథ్వీ షా తర్వాత ఆడుతున్న తొలి టెస్టులోనే శతకం చేసిన మూడో ముంబయి ఆటగాడిగానూ అయ్యర్‌ రికార్డు సృష్టించాడు.

ఇవీ చూడండి: సెంచరీ చేశా.. ఇక ఆయన్ను డిన్నర్​కు ఆహ్వానిస్తా: శ్రేయస్

Last Updated : Nov 27, 2021, 6:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.