Dhoni Mercedes Car : టీమ్ఇండియా మాజీ సారథి ధోనీకి క్రికెట్ అంతే ఎంత ఇష్టమో కార్ల కలెక్షన్ అంతే కూడా అంతే ఇష్టం. ఆయన ఇంట్లోని ఓ పెద్ద గ్యారేజ్‌లో వివిధ రకాల కార్లు, బైక్స్ ఉంటాయో అందరికీ తెలిసిందే. అందులో వింటేజ్ నుంచి మోడ్రన్ వరకు అన్ని రకాల కలెక్షన్స్ ఉంటాయి. ఇక ధోనీ కూడా అప్పుడప్పుడు వాటితో రాంచీలో రైడ్ చేస్తూ కనిపించి ఆకట్టుకుంటాడు. తాజాగా కూడా ఓ మెర్సీడీజ్ కారును నడుపుతూ కనిపించాడు. బ్లాక్ కలర్లో ఉన్న ఆ కారు చూపరులను ఆకట్టుకుని నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. అయితే.. ఆ కారు కంటే దానిపైన ఉన్న నెంబర్ ప్లేట్ నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. 0007 అని దానిపై రాసుండగా.. ఫ్యాన్స్ దీన్ని జేమ్స్ బాండ్ కారు అంటూ ముద్దుగా పిలుచుకుంటున్నారు. ఎందుకంటే జేమ్స్ బాండ్ మూవీ టైటిల్లో 007 ఉన్నందున ఫ్యాన్స్ ఈ కారును అలా పిలుస్తున్నారు.
ధోనీ సింప్లిసిటీ.. ఆ ఒక్క పనితో ఫ్యాన్స్ ఫిదా..
Dhoni Autograph To Fan : ఇక తాజాగా మిస్టర్ కూల్ చేసిన ఓ పని నెటిజన్లను ఫిదా చేసింది. ఇటీవలే ఓ అభిమాని తన బైక్‌పై ధోనీని ఆటోగ్రాఫ్ చేయమని కోరాడు. దీంతో ఆ ఫ్యాన్ కోరిక మేరకు బైక్ ముందు భాగంలో సైన్ చేసేందుకు సిద్ధమయ్యాడు. అయితే.. బైక్ మీద దుమ్ము, మరకలను చూసిన ధోనీ.. తన టీ షర్టుతో స్వయంగా దాన్ని శుభ్రం చేశాడు. ఆ తర్వాత బైక్ మీద ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. దీన్ని చూసిన నెటిజన్లు ధోనీ సింప్లిసిటీకి ఫిదా అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.
-
just one t-shirt increasing the price of that bike 🤌#MSDhoni𓃵 #CricketTwitter pic.twitter.com/BQqAyAtAUT
— Mohd Nazim 🇮🇳 (@ImNaz33) November 29, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">just one t-shirt increasing the price of that bike 🤌#MSDhoni𓃵 #CricketTwitter pic.twitter.com/BQqAyAtAUT
— Mohd Nazim 🇮🇳 (@ImNaz33) November 29, 2023just one t-shirt increasing the price of that bike 🤌#MSDhoni𓃵 #CricketTwitter pic.twitter.com/BQqAyAtAUT
— Mohd Nazim 🇮🇳 (@ImNaz33) November 29, 2023
'ఐపీఎల్లో మరో మూడేళ్ల పాటు'..
ఇక క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు చెప్పిన ధోనీ.. ఐపీఎల్లో మాత్రం కొనసాగుతున్నాడు. గతేడాది సీజన్లోనూ రాణించిన కెప్టెన్ కూల్.. 2023లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించారు. రికార్డు స్థాయిలో ఏకంగా ఐదోసారి ట్రోఫీ అందించాడు. అయితే ప్రస్తుతం ధోనీ వయసు 41 ఏళ్లు. వయసు దృష్ట్యా అతడు వచ్చే ఏడాది ఐపీఎల్‌కు ఆడదంటూ..అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ.. రిటెన్షన్ గడువు ముగిసే నేపథ్యంలో చెన్నై ఫ్రాంచైజీ.. తమ రిటెన్షన్ లిస్టులో ధోనీ పేరును చేర్చింది. ఇది చూసిన ఫ్యాన్స్ ఆనందంతో గంతులేస్తున్నారు. ధోనీని మరోసారి క్రీజులో చూడొచ్చంటూ ఆనందపడుతున్నాడు.
ఈ నేపథ్యంలో పలువురు మాజీలు ఈ విషయంపై స్పందించారు. ఇక ఏబీ డివిలియర్స్ కూడా ధోని మరో రెండు మూడేళ్ల పాటు ఐపీఎల్లో కొనసాగే సత్తా ఉన్న ఆటగాడని అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు.. రిటెన్షన్లో అతడి పేరు చూడగానే నాకు సంతోషంగా అనిపించింది. గత సీజన్ అతడికి చివరిది అవుతుంది అంటూ వార్తలు వినిపించాయి. అయితే అతడు 2024 సీజన్ కూడా ఆడేందుకు సిద్ధమయ్యాడు. ధోని అంటే సర్‌ప్రైజ్ ప్యాకేజ్.. అతడు ఇంకో రెండు.. మూడు ఏళ్ల పాటు ఐపీఎల్లో కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా వచ్చే ఎడిషన్‌లో ధోనీ కనిపించనుండటం నాకు నిజంగా సంతోషాన్నిస్తోంది" అని పేర్కొన్నారు.
నితిన్‌కు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన స్టార్ క్రికెటర్ - ఫ్యాన్ బాయ్ మూమెంట్ అంటే ఇదేనేమో!
'ధోనీ 99.9% సక్సెస్ఫుల్- ఆయన నిర్ణయాలను క్వశ్చన్ చేసే దమ్ము ఎవరికీ లేదు!'