సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ.. తుది పోరుకు సమయం ఆసన్నమైంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ తమిళనాడుతో సోమవారం(నవంబరు 22) మరోసారి ఫైనల్లో (Syed Mushtaq Ali Final) తలపడనుంది కర్ణాటక. అయితే 2019 టైటిల్ పోరులో కర్ణాటక చేతిలో ఓడిపోయిన తమిళనాడు.. ఈ సారి ప్రతీకారం తీర్చుకొని కప్పు నిలబెట్టుకోవాలని చూస్తోంది.
2020-21 ఎడిషన్‌లో బరోడాపై గెలిచి.. రెండోసారి టైటిల్ కైవసం చేసుకుంది తమిళనాడు. ఈ టోర్నీలో ఇప్పటి వరకు బరోడా, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక రెండేసి సార్లు (Syed Mushtaq Ali Winners) ఛాంపియన్లుగా నిలిచాయి. దీంతో ముచ్చటగా మూడోసారి కప్పును ముద్దాడడానికి కర్ణాటక, తమిళనాడు బరిలోకి దిగనున్నాయి.
కర్ణాటక కొట్టేనా?
కర్ణాటక ఛాంపియన్‌గా (Syed Mushtaq Ali Trophy) నిలిచేందుకు.. సెమీస్‌లో అదరగొట్టిన ఓపెనర్ రోహన్ మరోసారి బ్యాట్ ఝళిపించాల్సి ఉంటుంది. మిడిలార్డర్లో నిలకడలేమితో ఇబ్బంది పడుతున్న జట్టు (Karnataka Cricket Team).. ఫైనల్లో ఆ సమస్యను అధిగమించాలని ఆశిస్తోంది. ఇక టాప్ ఆర్డర్.. అభినవ్ మనోహర్, బీఆర్ భరత్ లాంటి ఆటగాళ్లతో పటిష్ఠంగానే కనబడుతుంది.
అయితే బౌలింగ్‌లో అనుభవలేమి కర్ణాటకను వేధిస్తోంది. కే గౌతమ్ ఇండియా-ఏ కి ఎంపికై వెళ్లడం ఆ జట్టుపై ప్రభావం చూపొచ్చు. కేసీ కరియప్ప, జే సుచిత్ రాణించాల్సిన అవసరం ఉంది.
తమిళనాడు నిలబెట్టుకుంటుందా?
టోర్నీ సాంతం సమష్టి కృషితో నిలకడగా రాణిస్తూ మంచి ఫామ్‌లో ఉంది తమిళనాడు (Tamilnadu Cricket Team). ఒక్కో దశలో ఒక్కో ఆటగాడు అద్భుత ప్రదర్శన చేస్తూ వచ్చారు. అయితే ఓపెనర్లు ఎన్ జగదీశన్, సీ హరి నిషాంత్.. ఫైనల్లోనూ తమ జోరు కొనసాగించాల్సి ఉంటుంది. యువ క్రికెటర్ సాయి సుదర్శన్ కూడా ఇప్పటి వరకు బాగా ఆకట్టుకున్నాడు.
ఇక జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన (Tamil Nadu Cricket Team Captain) కెప్టెన్ విజయ్ శంకర్ (181) మ్యాచ్‌ను మలుపు తిప్పేయగల సమర్థుడు. పవర్ హిట్టర్ ఎం శారుక్ ఖాన్ జట్టుకు అదనపు బలం. బౌలర్లలో టీ నటరాజన్, సందీప్ వారియర్, ఆర్ సాయి కిశోర్ కీలకం కానున్నారు.
ఇప్పటి వరకు ఇరు జట్లు టోర్నమెంట్లో అనేక సార్లు తలపడినా, సోమవారం నాటి పోరు ఆసక్తికరంగా జరగనుంది.
ఇదీ చూడండి: కివీస్‌పై టీమ్ఇండియా విక్టరీ.. సిరీస్ క్లీన్‌స్వీప్