De Kock Retirement : దక్షిణాఫ్రికా స్టార్ ఓపెనర్ క్వింటన్ డికాక్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 30 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్ తర్వాత ఈ 50 ఓవర్ల ఫార్మాట్‌కు వీడ్కోలు పలుకుతానని తెలిపాడు. 2021లోనే టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన అతడు తాజాగా వన్డే ఫార్మాట్‌కు గుడ్‌బై చెబుతున్నట్లు వెల్లడించాడు. క్వింటన్ డికాక్ రిటైర్మెంట్ డెసిషెన్ను క్రికెట్ సౌతాఫ్రికా(సీఏ) ధృవీకరించింది. వన్డే ప్రపంచకప్ బరిలో దిగబోయే జట్టును ప్రకటించిన కాసేపటికే డికాక్ రిటైర్మెంట్ నిర్ణయాం అందర్నీ షాక్‌కు గురిచేసింది.
కాగా, 2013లో వన్డే క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు డికాక్. కెరీర్లో 140 వన్డేలు ఆడిన అతడు.. 44.85 యావరేజ్, 96.08 స్ట్రైక్‌రేట్‌తో 5,966 పరుగులు చేశాడు. ఇందులో 17 శతకాలు, 29 అర్ధ శతకాలు ఉన్నాయి. 2016లో సెంచూరియన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 178 పరుగులు నమోదు చేశాడు. ఇదే అతడి అత్యధిక వ్యక్తిగత స్కోర్. వికెట్ కీపర్‌గా 183 క్యాచ్‌లు, 14 స్టంపింగ్‌లు చేశాడు డికాక్. 8 వన్డేల్లో టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించి.. 4 విజయాలను అందించాడు. గత రెండు వన్డే ప్రపంచకప్‌ల్లో ఆడిన అతడు.. మొత్తం 17 మ్యాచ్‌ల్లో 30 సగటుతో 450 పరుగులు చేశాడు.
-
🟡ANNOUNCEMENT 🟢
— Proteas Men (@ProteasMenCSA) September 5, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Quinton de Kock has announced his retirement from ODI cricket following the conclusion of the ICC @cricketworldcup in India 🏆 🏏
What's your favourite Quinny moment throughout the years ? 🤔 pic.twitter.com/oyR6yV5YFZ
">🟡ANNOUNCEMENT 🟢
— Proteas Men (@ProteasMenCSA) September 5, 2023
Quinton de Kock has announced his retirement from ODI cricket following the conclusion of the ICC @cricketworldcup in India 🏆 🏏
What's your favourite Quinny moment throughout the years ? 🤔 pic.twitter.com/oyR6yV5YFZ🟡ANNOUNCEMENT 🟢
— Proteas Men (@ProteasMenCSA) September 5, 2023
Quinton de Kock has announced his retirement from ODI cricket following the conclusion of the ICC @cricketworldcup in India 🏆 🏏
What's your favourite Quinny moment throughout the years ? 🤔 pic.twitter.com/oyR6yV5YFZ
Quinton De Kock Retirement From ODI : డికాక్ వన్డే రిటైర్మెంట్ విషయంపై దక్షిణాఫ్రికా క్రికెట్ డైరెక్టర్ ఈనాక్ ఎన్క్వే స్పందించాడు. సౌతాఫ్రికా టీమ్‌కు డికాక్ ఎనలేని సేవలు చేశాడని ప్రశంసించాడు. డికాక్.. తన అటాకింగ్ బ్యాటింగ్ స్టైల్‌తో సౌతాఫ్రికన్ క్రికెట్‌లో బెంచ్ మార్క్ సెట్ చేశాడని అన్నాడు. ఇకపోతే అక్టోబర్ 5 నుంచి భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరగనుంది. ఈ టోర్నీ బరిలోకి దిగే సౌతాఫ్రికా జట్టును సీఏ మంగళవారం అనౌన్స్ చేసింది. టెంబా సారథ్యంలో 15 మంది సభ్యులతో కూడిన జట్టును సెలెక్ట్ చేసింది.
వన్డే వరల్డ్‌కప్‌నకు సౌతాఫ్రికా జట్టు: టెంబా బవుమా (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, రస్సీ వాన్ డర్ డస్సెన్, డేవిడ్ మిల్లర్, ఎయిడెన్ మర్క్రమ్, క్వింటన్ డికాక్, కగిసో రబాడ, రీజా హెండ్రిక్స్, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోర్జే, సిసండ మగాలా, మార్కో జన్సెన్, గెరాల్డ్ కొయెట్జీ, కేశవ్ మహారాజ్, తబ్రేజ్ షంషి.
-
Here are the 1️⃣5️⃣ men who have been tasked with the ICC Men's @cricketworldcup duties 📝 🇿🇦
— Proteas Men (@ProteasMenCSA) September 5, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Let's back our boys 💪🏏 #CWC23 #ProteasSquadAnnouncement pic.twitter.com/4UXnHkrOlc
">Here are the 1️⃣5️⃣ men who have been tasked with the ICC Men's @cricketworldcup duties 📝 🇿🇦
— Proteas Men (@ProteasMenCSA) September 5, 2023
Let's back our boys 💪🏏 #CWC23 #ProteasSquadAnnouncement pic.twitter.com/4UXnHkrOlcHere are the 1️⃣5️⃣ men who have been tasked with the ICC Men's @cricketworldcup duties 📝 🇿🇦
— Proteas Men (@ProteasMenCSA) September 5, 2023
Let's back our boys 💪🏏 #CWC23 #ProteasSquadAnnouncement pic.twitter.com/4UXnHkrOlc
Himadas Suspended : భారత స్టార్ అథ్లెట్ హిమదాస్‌కు షాక్.. కనీసం ఏడాది పాటు నిషేధం