ఐసీసీ ప్రపంచకప్ 2019లో భాగంగా ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య లార్డ్స్ వేదికగా నేడు ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ ఆట వీక్షించేందుకు భారీగా రేట్లు పెట్టి టికెట్లు కొంటున్నారు అభిమానులు. అనధికార వెబ్సెట్లు, కొంత మంది ప్రైవేటు వ్యక్తులు రేట్లు పెంచి టికెట్లను బ్లాక్లో అమ్మేస్తున్నారట. ఫలితంగా ఒక్కో టికెట్టు ధర దాదాపు రూ.82వేలు నుంచి 13 లక్షల 78 వేలు పలుకుతున్నట్లు సమాచారం. ఈ విషయంపై ఐసీసీ సీరియస్ అయింది. చట్టవ్యతిరేకంగా టికెట్లు అమ్ముతున్నవారిపై చర్యలు తీసుకొంటామని ప్రకటించింది. టికెట్లు కావాలనుకున్నవారు అధికారిక వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేయాలని సూచించింది.
భారత్ టికెట్లు సేల్..
ఈ వేదికలో టీమిండియా ఫైనల్ ఆడుతుందని ఆశించిన భారత్ అభిమానులు చాలా వరకు టికెట్లను కొనేశారు. కానీ ఊహించని రీతిలో కోహ్లీసేన సెమీఫైనల్లోనే ఇంటిముఖం పట్టడం వల్ల వాటిని అమ్ముకొంటున్నారట. కొందరు ప్రైవేట్ వ్యక్తులు భారతీయుల నుంచి టికెట్లు కొనుగోలు చేసి అధిక ధరలకు విక్రయించడమే ప్రస్తుత పరిస్థితికి కారణంగా తెలుస్తోంది.
ఇవీ చూడండి.... 'మీరు చూడకపోతే టిక్కెట్లు అమ్మండి.. ప్లీజ్'