వరల్డ్‌కప్ 2019 ఆరంభంలోనే ఆతిథ్య ఇంగ్లాండ్ గెలుపు సొంతం చేసుకుంది. ఓవల్ వేదికగా దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో 104 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ ఆటలో బెన్‌స్టోక్స్ ఆల్‌రౌండర్ ప్రదర్శనతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఫలితంగా 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అందుకున్నాడు. దక్షిణాఫ్రికా ఆటగాడు ఆండిలే పెహ్లుక్వాయో కొట్టిన బంతిని... బౌండరీ లైన్ వద్ద కళ్లు చెదిరే రీతీలో అందుకోవడం ఆటకే హైలైట్.
తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ ఆటగాళ్లలో బెన్‌స్టోక్స్ 79 బంతుల్లో 89 పరుగులతో ఆకట్టుకున్నాడు. అంతేకాకుండా రెండు వికెట్లు తీసి బౌలింగ్‌లోనూ అదరగొట్టాడు.
ఈ సూపర్ క్యాచ్‌పై మ్యాచ్ అనంతరం స్పందించిన స్టోక్స్.. ఇదేమి తన బెస్ట్ క్యాచ్ కాదని చెప్పుకొచ్చాడు. ఇలాంటి మెరుగైన ప్రదర్శనతో జట్టు మరిన్ని విజయాలు సాధించేందుకు తోడ్పడతానని వెల్లడించాడు.
ఇవీ చూడండి... WC19: ప్రపంచకప్ బోణి ఆతిథ్య ఇంగ్లండ్‌దే