బంగ్లాదేశ్ క్రికెటర్ షకిబుల్ హసన్ అరుదైన ఘనత సాధించాడు. ప్రపంచకప్‌లో వెయ్యి పరుగులు పూర్తి చేసిన తొలి బంగ్లా ఆటగాడిగా రికార్డు సాధించాడు. అఫ్గాన్‌తో జరిగిన మ్యాచ్‌లో షకిబుల్ అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. 5 వికెట్లు పడగొట్టాడు.
-
Best bowling figures for 🇧🇩 in World Cups ✅
— Cricket World Cup (@cricketworldcup) June 24, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Most wickets for 🇧🇩 in World Cups ✅
Most runs for 🇧🇩 in World Cups ✅
Most runs of anyone in #CWC19 ✅
Ladies and gentlemen, Shakib Al Hasan.#RiseOfTheTigers pic.twitter.com/YR47zbcstg
">Best bowling figures for 🇧🇩 in World Cups ✅
— Cricket World Cup (@cricketworldcup) June 24, 2019
Most wickets for 🇧🇩 in World Cups ✅
Most runs for 🇧🇩 in World Cups ✅
Most runs of anyone in #CWC19 ✅
Ladies and gentlemen, Shakib Al Hasan.#RiseOfTheTigers pic.twitter.com/YR47zbcstgBest bowling figures for 🇧🇩 in World Cups ✅
— Cricket World Cup (@cricketworldcup) June 24, 2019
Most wickets for 🇧🇩 in World Cups ✅
Most runs for 🇧🇩 in World Cups ✅
Most runs of anyone in #CWC19 ✅
Ladies and gentlemen, Shakib Al Hasan.#RiseOfTheTigers pic.twitter.com/YR47zbcstg
యువీ రికార్డు బద్దలు..
2011లో యువీ నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 50 పరుగులతో పాటు బంతితోనూ మాయ చేశాడు. 31 పరుగలిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. తాజాగా ఈ ఫీట్‌ను బద్దలు కొట్టాడు బంగ్లా ఆల్‌రౌండర్ షకిబుల్. అర్ధశతకంతో పాటు బౌలింగ్‌లో 29 పరుగులే ఇచ్చి 5 వికెట్లు తీశాడు. ప్రపంచకప్‌లో ఓ బంగ్లాదేశ్ బౌలర్‌కి ఇవే అత్యుత్తమ గణాంకాలు.
ఈ మెగాటోర్నీలో టాప్ స్కోరర్..
అఫ్గాన్‌పై అర్ధశతకం చేసిన షకిబుల్ హసన్.. ఈ మెగాటోర్నీలో అత్యధిక పరుగులు(476) చేసిన ఆటగాడిగా నిలిచాడు. 447 పరుగులు చేసి డేవిడ్ వార్నర్ రెండో స్థానంలో ఉన్నాడు. ఈ టోర్నీలో ఇంగ్లాండ్, వెస్టిండీస్‌పై షకిబుల్ రెండు శతకాలు చేశాడు. ఆరువేల వన్డే పరుగుల మైలురాయిని పూర్తి చేసుకున్న ఇద్దరు బంగ్లా ఆటగాళ్లలో షకిబ్ ఒకడు.
సౌతాంప్టన్ వేదికగా అఫ్గాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 62 పరుగుల తేడాతో గెలిచింది. ముష్ఫీకర్ రహీమ్(83), షకిబుల్ హసన్(51) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు.
ఇది చదవండి: షకిబ్ అదరహో... బంగ్లా సెమీస్ ఆశలు సజీవం