ప్రపంచకప్ సెమీస్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలైన టీమిండియా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆ మ్యాచ్ అనంతరం రవీంద్ర జడేజా చాలా బాధపడ్డాడని అతడి భార్య రివాబ చెప్పారు. ఆ సమయంలో ఓదార్చలేకపోయానన్నారు. తాను క్రీజులో ఉంటే గెలిచేవాళ్లమని తనతో చెప్పాడని ఆమె ఓ ఇంటర్వూలో పేర్కొన్నారు.
"రవీంద్ర జడేజా.. జట్టు కష్టాల్లో ఉన్న ప్రతీసారి మంచి ప్రదర్శన చేశాడు. కీలక సమయంలో వికెట్లు తీస్తూ జట్టుకు అవసరమైన పరుగులు చేశాడు. 2013 ఐసీసీ ఛాంపియన్స్ట్రోఫీ ఫైనల్స్‌లో ఆల్‌రౌండర్ ప్రదర్శన చేసిన జడేజా మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు." -రివాబ, రవీంద్ర జడేజా భార్య
న్యూజిలాండ్‌తో జరిగిన ప్రపంచకప్ మ్యాచ్‌లో అద్భుతంగా ఆడిన జడేజా.. ధోనితో కలిసి జట్టును విజయం వరకు తీసుకెళ్లాడు. కానీ చివర్లో ఔటై నిరాశపరిచాడు.ఈ క్రమంలో 77 పరుగులు చేసి ఆ మ్యాచ్‌లో టీమిండియా తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అందులో 18 పరుగుల తేడాతో ఓడింది కోహ్లీ సేన.
ఇది చదవండి: జడేజా, ధోనీ వీరోచిత ఇన్నింగ్స్ వృథా... కివీస్ చేతిలో టీమిండియా ఓటమి