వన్డే ప్రపంచకప్‌లో సెమీఫైనల్ అవకాశాలు దాదాపుగా కనుమరుగైన వేళ... ఎక్కడో చిన్నపాటి ఆశతో బంగ్లాదేశ్‌తో పోరుకు సిద్ధమవుతోంది పాకిస్థాన్. శుక్రవారం లార్డ్స్ వేదికగా ఇరుజట్లు తలపడనున్నాయి. ఈ టోర్నీలో ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓటమి కారణంగా పాకిస్థాన్ సెమీఫైనల్ ఆశలు సన్నగిల్లాయి. అదే ఆతిథ్య జట్టు చేతిలో న్యూజిలాండ్ పరాభవంతో సర్ఫ్రాజ్ సేన ఇంటికెళ్లిపోవడం దాదాపు ఖరారైపోయింది.
టాస్ కీలకం...
పాకిస్థాన్ సెమీస్‌కు చేరాలంటే బంగ్లాదేశ్‌తో జరిగే పోరులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా వన్డే క్రికెట్ చరిత్రలో మహాద్భుత విజయాన్ని ఆ జట్టు సాధించాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో తొలుత ఫీల్డింగ్ చేస్తే ఒక్క బంతి పడకుండానే పాక్ సెమీస్ ఆశలు ఆవిరవుతాయి. అందుకే ఈ మ్యాచ్‌లో టాస్ గెలవడం ఆ జట్టుకు తప్పనిసరి.
గెలిస్తే అద్భుతమే...
ఒకవేళ తొలుత బ్యాటింగ్ చేసినా పాకిస్థాన్ సెమీస్‌కు చేరడం అంత సులువేం కాదు. పాక్ 350 పరుగులు చేస్తే బంగ్లాదేశ్‌ను 39 పరుగులకే కట్టడి చేయాలి. ఒకవేళ 400 రన్స్ చేస్తే 316 పరుగుల తేడాతో గెలవాల్సి ఉంటుంది. ఇది దాదాపు అసాధ్యం.
రన్‌రేట్‌తో పాక్‌కు కష్టాలు...
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న న్యూజిలాండ్ ఖాతాలో 11 పాయింట్లు ఉన్నాయి. ఆ జట్టు నెట్ రన్‌రేట్ + 0.175గా ఉంది. పాకిస్తాన్ ఖాతాలో 9 పాయింట్లు ఉండగా వారి నెట్ రన్‌రేట్ -0.792గా ఉంది. బంగ్లాదేశ్‌పై పాక్ నెగ్గి... న్యూజిలాండ్‌తో సమానంగా 11 పాయింట్లు సాధించినా నెట్ రన్‌రేట్‌లో వెనుకంజలోనే ఉంటుంది.
బ్యాటింగ్ విభాగంలో బాబర్ అజమ్, హారిస్ సోహైల్ ఫామ్‌లో ఉన్నారు. బౌలింగ్‌లో షాహీన్ అఫ్రిదీ, మహమ్మద్ ఆమిర్ రాణిస్తున్నారు.
గెలుపు కోసం బంగ్లాదేశ్...
1999 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ను ఓడించిన బంగ్లాదేశ్ మరోసారి అదే విజయాన్ని పునరావృతం చేయాలని చూస్తోంది. ఈ టోర్నీలో దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్, వెస్టిండీస్‌పై గెలుపొందిన బంగ్లా... ఓడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ గట్టి పోటీ ఇచ్చింది.
-
Snaps from the practice session ahead of the #CWC19 clash against Pakistan on July 5. pic.twitter.com/Mx4Lxb5Yd1
— Bangladesh Cricket (@BCBtigers) July 4, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Snaps from the practice session ahead of the #CWC19 clash against Pakistan on July 5. pic.twitter.com/Mx4Lxb5Yd1
— Bangladesh Cricket (@BCBtigers) July 4, 2019Snaps from the practice session ahead of the #CWC19 clash against Pakistan on July 5. pic.twitter.com/Mx4Lxb5Yd1
— Bangladesh Cricket (@BCBtigers) July 4, 2019
స్టార్ ఆల్‌రౌండర్ షకిబ్‌పై ఆ జట్టు ఎక్కువగా ఆధారపడుతోంది. ఈ టోర్నీలో 500కి పైగా పరుగులు సాధించిన షకిబ్... బౌలింగ్‌లోనూ 10 వికెట్లు తీసి సత్తా చాటాడు. టోర్నీ ఆసాంతం 300 పరుగుల మైలురాయిని కూడా దాటగలుగుతున్న బంగ్లాను... బౌలింగ్ వైఫల్యాలే వేధిస్తున్నాయి.
ఆ జట్టు కెప్టెన్ మోర్తాజా పేలవమైన ఫామ్‌తో సతమతమౌతున్నాడు. పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో విజయం సాధించి విశ్వసమరాన్ని ఘనంగా ముగించాలని కోరుకుంటోంది బంగ్లా జట్టు. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది.
జట్లు...
- బంగ్లాదేశ్:
తమీమ్ ఇక్బాల్, సౌమ్య సర్కార్, షకిబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీమ్(కీపర్), లిటన్ దాస్, మహ్మదుల్లా, హొస్సేన్, మెహదీ హసన్, మోర్తజా (సారథి), రూబెల్, ముస్తాఫిజుర్ రెహ్మన్.
- పాకిస్థాన్:
ఫకర్ జమాన్, ఇమాముల్ హక్, బాబర్ అజమ్, సొహైల్, హఫీజ్, సర్ఫ్రాజ్ అహ్మద్ (కెప్టెన్), ఇమాద్ వసీం, షాదాబ్ ఖాన్, వాహబ్ రియాజ్, షాహీన్ అఫ్రిదీ, ఆమిర్.