ETV Bharat / sports

నేడు కెప్టెన్​ కూల్​ ధోని.. 38వ పుట్టినరోజు - captain dhoni

"అదుగో పెను నిశ్శబ్దం ముక్కలవుతున్న భీకర దృశ్యం.." అని ఓ సినీకవి అన్న మాటలు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్​ ధోనికి సరిగ్గా సరిపోతాయి. మైదానంలో కూల్​గా కనిపించే ధోని... అవసరమైన సందర్భంలో బ్యాటుతో చెలరేగి ఆడతాడు. సారథిగా ఎవ్వరూ​ అందుకోని రికార్డులను మహి సాధించాడు.  నేడు ధనాధన్ ధోని 38వ పుట్టినరోజు.

మహేంద్రుడికి నేడు 38వ పుట్టినరోజు
author img

By

Published : Jul 7, 2019, 7:53 AM IST

Updated : Jul 7, 2019, 9:35 AM IST

భారత జట్టు మాజీ సారథి​ మహేంద్రసింగ్​ ధోని నేడు 38వ ఏటలోకి అడుగుపెడుతున్నాడు. మహి జన్మదినోత్సవం సందర్భంగా కెప్టెన్​ కూల్​ గురించి కొన్ని విశేషాలు మీకోసం..

dhoni 38th birthday celebrations
మిస్టర్​ కూల్​గా అభిమానుల పిలుపు

నేపథ్యం..

'కెప్టెన్​ కూల్​'​ మహేంద్ర సింగ్‌ ధోని... జులై 7, 1981న ఝార్ఖండ్​లోని రాంచీలో జన్మించాడు. తండ్రి ప్రభుత్వ ఉద్యోగి. మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన మహికి... చిన్నప్పటి నుంచే ఆటలంటే మక్కువ. యుక్త వయసులో ఫుట్​బాల్, బ్యాడ్మింటన్​పై మొగ్గుచూపిన ధోని... తర్వాత క్రికెట్లో అడుగుపెట్టి అరుదైన రికార్డులు సొంతం చేసుకున్నాడు.

dhoni 38th birthday celebrations
ఫుట్​బాల్​తో మహీ

ఆరంగేట్రం...

దేశవాళీ క్రికెట్​లో ధోని బిహార్ జట్టుకు ప్రాతినిధ్యం వహించేవాడు. ఇండియా-ఎ తరఫున తొలి సెంచరీ సాధించాడు. తర్వాత కెన్యా, జింబాబ్వేలపై మంచి ప్రదర్శన కనబరిచాడు. ధోని ప్రతిభను గుర్తించిన అప్పటి కెప్టెన్ సౌరవ్ గంగూలీ... బంగ్లాదేశ్​తో మ్యాచ్​కు ఎంపిక చేశాడు. ఆ విధంగా 2004లో డిసెంబర్​ 23న బంగ్లాదేశ్‌పై తొలి అంతర్జాతీయ వన్డే ఆడాడు ధోని. కాని ఈ మ్యాచ్​లో డకౌట్​గా నిరాశపరిచాడు. తర్వాత 2005లో శ్రీలంకతో తొలి టెస్ట్‌ మ్యాచ్ ఆడాడు. ఈ మ్యాచ్​లో 183 పరుగులు చేశాడు. 2006లో భారత్‌-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన అంతర్జాతీయ టీ20 మ్యాచ్​తో పొట్టి క్రికెట్​లో అడుగు పెట్టాడు.

dhoni 38th birthday celebrations
గంగూలీతో ధోనీ
dhoni 38th birthday celebrations
183 పరుగులు వ్యక్తిగత అత్యధికం

తిరుగులేని నాయకుడు..

కెరీర్​ ఆరంభం నుంచే తనదైన నాయకత్వంతో భారత జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు ధోని. 2011లో వన్డే ప్రపంచకప్​, 2007లో టీ20 వరల్డ్​కప్​, 2013లో ఛాంపియన్స్​ ట్రోపీ అతడి సారథ్యంలోనే టీమిండియా గెలిచింది. ఈ మూడు విభాగాల్లో జట్టును విజేతగా నిలిపిన ఘనత ధోనిదే. ఇప్పటివరకు ఏ దేశ సారథి మొత్తం ఈ మూడు టైటిల్స్​ను గెలవలేదు. అంతేకాదు 1983లో భారత్​ ప్రపంచకప్​ గెలిచిన తర్వాత మళ్లీ 28 ఏళ్లకు రెండోసారి వరల్డ్​కప్​ తెచ్చిన సారథి ధోని.

మహేంద్రుడికి నేడు 38వ పుట్టినరోజు
ధోనీ విజయాలు

ఐపీఎల్​లో చెన్నై సూపర్​ కింగ్స్​కు నాయకత్వం వహించిన ధోని.. ఆ జట్టును ఎనిమిది సార్లు ఫైనల్​కు తీసుకెళ్లాడు. అందులో మూడుసార్లు విజేతగా నిలిచింది.

రికార్డులు...

2007లో సారథిగా బాధ్యతలు చేపట్టిన ధోని... 200 వన్డేలకు నాయకుడిగా వ్యవహరించాడు. వాటిలో 110 మ్యాచ్​ల్లో టీమిండియా విజయాలు సాధించింది. స్వదేశంలో 73 మ్యాచ్​లకు కెప్టెన్సీ చేస్తే 43 విజయాలు మహి సొంతమయ్యాయి. ఇప్పటివరకు భారత్​ తరఫున 90 టెస్టులు, 348 వన్డేలు, 98 టీ20లు ఆడాడు. వన్డేల్లో 10వేలకు పైగా, టెస్టుల్లో 5వేలకు పైగా పరుగులు సాధించాడు.

భారత్​కు అత్యధిక కాలం కీపర్​గా సేవలందించాడు. అంతర్జాతీయ క్రికెట్​లో అత్యధిక స్టంపింగ్​లు(123) చేసిన వికెట్​ కీపర్​గా ఘనత సాధించాడు. ప్రస్తుతం నాలుగో ప్రపంచకప్​ ఆడుతున్న ధోనీ... టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు.

dhoni 38th birthday celebrations
కీపింగ్​లో అద్భుతమైన వేగం మహీ సొంతం

ఇష్టాలు...

లతా మంగేష్కర్ పాటలంటే చెవి కోసుకుంటాడు ధోని. గిల్​క్రిస్ట్ నచ్చిన క్రీడాకారుడు. బైకులు సేకరించడమంటే ఆసక్తి. వీడియో గేమ్స్​ ఆడటం, పెయింటింగ్, ట్రెక్కింగ్​ చేయడం ఇష్టం.

dhoni 38th birthday celebrations
విభిన్న బైక్​లతో మహేంద్రసింగ్​ ధోనీ

భార్య పేరుతో ఛారిటీ..

2010 జులై 4న సాక్షిని పెళ్లిచేసుకున్నాడీ ఝార్ఖండ్​ డైనమైట్​. వీరిద్దరికి జీవా సంతానం. తన సతీమణి సాక్షి పేరిట ఓ సేవాసంస్థను ఏర్పరచిన ధోని... ఎయిడ్స్ బాధిత పిల్లలకు సహాయ సహకారాలు అందిస్తున్నాడు.

dhoni 38th birthday celebrations
సతీమణి సాక్షి, పాప జీవాతో ధోనీ

రిటైర్మెంటు...

ఐసీసీ ప్రపంచకప్​ 2019లో సెమీస్​ చేరిన టీమిండియా... ఒకవేళ జులై 14న విశ్వవిజేతగా నిలిస్తే అదే రోజున ధోని కెరీర్​కు వీడ్కోలు పలికే అవకాశముందనే వార్తలు వినిపిస్తున్నాయి.

ధోని క్రికెట్​లో చేసిన సేవలకు పద్మశ్రీ, పద్మ భూషణ్​ పురస్కారంతో సత్కరించింది భారత ప్రభుత్వం. ప్రస్తుతం లెఫ్ట్​నెంట్​ కల్నల్​ హోదాలో సైనిక విభాగంలో సభ్యుడిగా ఉన్నాడు.

dhoni 38th birthday celebrations
లెఫ్ట్​నెంట్​ కల్నల్​ హోదాలో ధోనీ

AP Video Delivery Log - 1800 GMT ENTERTAINMENT
Saturday, 6 July, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1637: UK Royal Christening STILLS No access UK; No archive 4219271
Duke and Duchess of Sussex's baby christened
AP-APTN-1049: ARCHIVE Royal Christening AP Clients Only 4219250
Royal baby Archie to have private Windsor Castle christening
AP-APTN-1010: UK Celine Dion Content has significant restrictions, see script for details 4219249
Celine Dion kicks off Hyde Park summer concerts
AP-APTN-2137: UK Silver Clef Awards AP Clients Only 4219226
Ed Sheeran, Sam Smith, Dua Lipa, Mabel and more attend Nordoff Robbins O2 Silver Clef Awards to help support music therapy programs for people in need
AP-APTN-2121: France Baby Giraffe AP Clients Only 4219224
Paris zoo welcomes fifth generation baby Kordofan giraffe
AP-APTN-2120: US Baby Beluga Whale Content has significant restrictions, see script for details 4219223
Beluga whale calf born at Chicago aquarium
AP-APTN-1953: UK Josh Groban BST Content has significant restrictions, see script for details 4219205
Josh Groban on supporting Celine Dion, Taylor Swfit and trying to 'slow down time' at BST festival in order to 'experience it on a deeper level'
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Jul 7, 2019, 9:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.