ప్రపంచకప్‌లో భారత్ ప్రదర్శనపై బీసీసీఐ పాలక మండలి(సీఓఏ) సమీక్ష నిర్వహించనుంది. ఈ భేటీలో కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి సహా టీమ్ మేనేజ్మెంట్కు ప్రశ్నలు సంధించనుంది. మెగాటోర్నీలో భారత్ ప్రదర్శన, తుది జట్టులో ఆటగాళ్ల ఎంపికపై చర్చించనుంది. ఈ సమావేశం ఎప్పుడు జరగనుందో త్వరలో తెలియపరుస్తామని సీఓఏ సారథి వినోద్ రాయ్ తెలిపారు.
"మెగాటోర్నీలో టీమిండియా ప్రదర్శనపై కోచ్, కెప్టెన్లతో ఓ సమీక్ష నిర్వహిస్తాం. ఇది ఎప్పుడు జరుగుతుందో త్వరలో తెలియజేస్తాం. సెలక్షన్ కమిటీతోనూ దీనిపై చర్చిస్తాం" - సీఓఏ చీఫ్ వినోద్ రాయ్
ముఖ్యంగా ఈ సమీక్షలో జట్టు బృందానికి.. సీఓఏ మూడు ప్రశ్నలు సంధించనున్నట్టు సమాచారం.
- అంబటి రాయుడిని జట్టులోకి ఎందుకు తీసుకోలేదు..?
- ముగ్గురు వికెట్ కీపర్లకు సెమీఫైనల్ జట్టులో చోటు ఎందుకు లభించింది.?
- సెమీస్‌లో ధోనీని 7వ స్థానంలో ఎందుకు పంపారు..?
న్యూజిలాండ్‌తో జరిగిన సెమీస్ మ్యాచ్‌లో భారత్ 18 పరుగుల తేడాతో ఓడిపోయి అభిమానుల ఆశలను ఆవిరి చేసింది. ధోనీని 7వ స్థానంలో పంపడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ముందే వచ్చుంటే టీమిండియా గెలిచేదే అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
గాయం కారణంగా జట్టుకు దూరమైన విజయ్‌శంకర్ స్థానంలో మయాంక్ అగర్వాల్‌కు స్థానం కల్పించారు. స్టాండ్ బై ఆటగాడిగా ఉన్న రాయుడును పక్కన పెట్టారు. ఇందుకు మనస్తాపం చెందిన రాయుడు రిటైర్మెంటు ప్రకటించాడు.
ఇది చదవండి: కోహ్లీసేన ప్రపంచకప్ ప్రైజ్‌మనీ ఇదే..