వరల్డ్ కప్ ఫీవర్ దేశమంతా వ్యాపించింది. ఈ నేపథ్యంలో ఒక్కొక్కరు వివిధ రకాలుగా తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. టీమిండియా సెమీస్ చేరిన సందర్భంగా బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి బంగారంతో వరల్డ్ కప్ ట్రోఫీని తయారుచేసి తన అభిమానాన్ని చాటుకున్నాడు.
బెంగళూరుకు చెందిన నగల వ్యాపారి నాగరాజ్ రివాన్కర్ 1.5 సెంటిమీటర్ల పొడవు 0.49 గ్రాముల బరువుతో ప్రపంచకప్‌ను రూపొందించాడు. అత్యంత చిన్నగా ఉన్న ఈ ట్రోఫీ ప్రతీ ఒక్కరినీ ఆకర్షిస్తోంది.
ప్రపంచ కప్‌లో ఇప్పటి వరకు భారత్ ఆడిన 8 మ్యాచ్‌లలో 13పాయింట్లు సాధించింది. వీటిలో భారత్ కేవలం ఒకే ఒక్క మ్యాచ్ ఓడిపోయింది. పాయింట్ల పట్టికలో రెండవ స్థానాన్ని కైవసం చేసుంకుంది. జులై 6న శ్రీలంకతో తలపడనుంది టీమిండియా.
ఇది చదవండి: 'రోహిత్ శర్మ.. వన్డేల్లో గొప్ప క్రికెటర్'