అఫ్గానిస్థాన్ బౌలర్ రషీద్ ఖాన్‌కు అదృష్టం కలిసొచ్చింది. అన్ని ఫార్మాట్లకు కెప్టెన్‌గా నియమిస్తూ ఆ దేశ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. అస్గర్ అఫ్గాన్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించింది. ఇప్పటికే టీ 20 ఫార్మాట్‌కు సారథిగా ఉన్న 20ఏళ్ల రషీద్ ఖాన్... వన్డే, టెస్టు జట్టుకూ కెప్టెన్‌గా నియామితుడయ్యాడు.
ప్రపంచకప్‌లో ఒక్క మ్యాచ్‌లోనూ విజయం సాధించలేదు అఫ్గాన్ జట్టు. దీంతో వన్డే కెప్టెన్‌గా ఉన్న గుల్బదీన్ నైబ్‌పై వేటు వేసింది. లెగ్‌స్పిన్నర్ రషీద్ ఖాన్‌కు అవకాశం కల్పించింది.
సెప్టెంబరులో బంగ్లాదేశ్‌తో జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో సారథ్య పగ్గాలు చెపట్టనున్నాడు రషీద్. అనంతరం బంగ్లా, జింబాబ్వేతో జరగనున్న త్రైపాక్షిక సిరీస్ ఆడనుంది అప్గానిస్థాన్.
62 వన్డేలాడిన రషీద్ 60 వికెట్లు తీశాడు. 2 టెస్టుల్లో 12 వికెట్లు, 38 టీ 20ల్లో 32 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇది చదవండి: WC19: 'ధోనీ రనౌట్ మా అదృష్టం...!'