ప్రపంచకప్‌లో సంచలనాలు సృష్టిద్దామనుకున్న పసికూన అఫ్గానిస్థాన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ మహ్మద్ షెహజాద్ మోకాలి గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఇప్పటికే ఈ మెగా టోర్నీలో ఆడిన 2 మ్యాచుల్లో ఓడింది అఫ్గాన్. షెహజాద్ దూరం కానుండటం వల్ల జట్టు మరింత బలహీనంగా మారనుంది.
ఇప్పుడిప్పుడే మంచి ప్రదర్శనలు చేస్తూ తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటుందీ జట్టు. టీమ్‌లో నాణ్యమైన స్పిన్నర్లకు తోడు దూకుడైన బ్యాట్స్‌మెన్ ఉన్నారు. నబీ, రషీద్ ఖాన్ ప్రపంచంలోనే ఉత్తమ స్పిన్నర్లుగా కొనసాగుతున్నారు.
ఐసీసీ ట్వీట్...
2015 ప్రపంచకప్ నుంచి అఫ్గాన్ తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా ఉన్నాడు షెహజాద్. 55 ఇన్నింగ్స్‌ల్లో 1,843 పరుగులు చేశాడు. ఇతడి స్థానాన్ని ఇక్రామ్ అలీ ఖిల్ భర్తీ చేయనున్నాడు. ఇందుకు ఐసీసీ అంగీకారం తెలిపింది. షెహజాద్ ఫొటో షేర్ చేస్తూ.. అతడిని మిస్ అవుతున్నామని ట్వీట్ చేసింది ఐసీసీ.
-
"We will miss you, Mohammad Shahzad" 😔 #AfghanAtalan pic.twitter.com/14BqwYphpm
— ICC (@ICC) June 7, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">"We will miss you, Mohammad Shahzad" 😔 #AfghanAtalan pic.twitter.com/14BqwYphpm
— ICC (@ICC) June 7, 2019"We will miss you, Mohammad Shahzad" 😔 #AfghanAtalan pic.twitter.com/14BqwYphpm
— ICC (@ICC) June 7, 2019
ప్రపంచకప్‌కు ముందు పాకిస్థాన్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో షెహజాద్‌కు గాయమైంది. అలాగే అఫ్గాన్ ఆరంభ మ్యాచ్‌లలో బరిలోకి దిగాడు. ఆస్ట్రేలియాపై డకౌట్ అయిన ఈ ఓపెనర్.. లంకపై 7 పరుగులు చేసి వెనుదిరిగాడు.
జూన్ 8న న్యూజిలాండ్‌తో అఫ్గానిస్థాన్ తన తదుపరి మ్యాచ్ ఆడనుంది.
ఇదీ చూడండి: