ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ (కొవిడ్ 19)పై ఇంగ్లాండ్ మాజీ బ్యాట్స్‌మన్ కెవిన్ పీటర్సన్ శుక్రవారం స్పందించాడు. వైరస్ నియంత్రణకు భారత ప్రభుత్వ సూచనలను పాటించాలని హిందీలో ట్వీట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే ఈ క్రికెటర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో అదిరిపోయే ఫొటో పోస్టు చేసి అడ్డంగా బుక్కయ్యాడు. అతడు ఓ మారుమూల ప్రాంతంలో కూర్చున్నట్లు కనిపిస్తున్న ఆ ఫొటోలో కుడిభుజంపై అందమైన పక్షి వాలి ఉంది. ఎడమవైపు గంభీరంగా చూస్తున్న ఓ చిరుతపులి, శునకం ఉన్నాయి. తాను జంతు ప్రేమికుడనే అర్థం వచ్చేలా క్యాప్షన్ పెట్టాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఇది చూసిన టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్.. పీటర్సన్‌ను అభినందిస్తూ ఎగతాళి చేశాడు. 'నైస్ ఫొటోషాప్ బ్రో' అంటూ కామెంట్ చేశాడు. దీంతో నెటిజెన్లు ఇంగ్లాండ్ మాజీని ట్రోల్ చేయడం ఆరంభించారు. చివరకు చేసేదిలేక పీటర్సన్ కామెంట్లలోనే అది ఫొటోషాప్‌లో చేసిందేనని తెలిపాడు. అయితే వీరిద్దరూ గతంలోనూ ఎన్నోసార్లు సామాజిక మాధ్యమాల్లో ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డారు.

ఇదీ చూడండి.. 'కైఫ్, యువీ లాంటి భాగస్వామ్యం అవసరం'