మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్పై మరోసారి స్పందించాడు టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. 'మీరు ఎప్పటికీ నా కెప్టెనే' అంటూ ఓ వీడియోలో వెల్లడించాడు. ధోనీ నుంచి తనకు లభించిన స్నేహానికి, నమ్మకానికి మాజీ కెప్టెన్‌కు కృతజ్ఞతలు తెలియజేశాడు. క్రికెట్‌కు ధోనీ వీడ్కోలుపై విరాట్ కోహ్లీ మాట్లాడుతున్న ఓ వీడియోను సోషల్‌మీడియాలో పంచుకుంది భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ).
-
"I've always said this and I will say it again, you will always be my Captain," #TeamIndia Skipper @imVkohli pays his tribute to @msdhoni who announced his retirement from international cricket at 1929 hours yesterday.#ThankYouMSD pic.twitter.com/U6uWlow4lB
— BCCI (@BCCI) August 16, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">"I've always said this and I will say it again, you will always be my Captain," #TeamIndia Skipper @imVkohli pays his tribute to @msdhoni who announced his retirement from international cricket at 1929 hours yesterday.#ThankYouMSD pic.twitter.com/U6uWlow4lB
— BCCI (@BCCI) August 16, 2020"I've always said this and I will say it again, you will always be my Captain," #TeamIndia Skipper @imVkohli pays his tribute to @msdhoni who announced his retirement from international cricket at 1929 hours yesterday.#ThankYouMSD pic.twitter.com/U6uWlow4lB
— BCCI (@BCCI) August 16, 2020
"జీవితంలోని కొన్ని సందర్భాల్లో మాటలు రాని క్షణాలు ఉంటాయి. వాటిలో ఇదొక్కటని నేను అనుకుంటా. ధోనీ గురించి చెప్పాలంటే బస్సులోని చివరి సీట్లో కూర్చునే వ్యక్తి. మేమిద్దరం స్నేహంతో పాటు మంచి అవగాహనను పంచుకున్నాం. ఎందుకంటే మేము ఒకే లక్ష్యాల కోసం పనిచేశాం. అదే జట్టు విజయానికి కారణమైంది. మీతో(ధోనీ) కలిసి ఆడటం చాలా ఆనందంగా ఉంది. మీరు నాపై నమ్మకాన్ని చూపించారు. దీనికి మీకెంతగానో కృతజ్ఞతతో ఉంటా. గతంలో చెప్పిందే ఇప్పుడు చెబుతున్నా. మీరు(ధోనీ) ఎప్పుడూ నా కెప్టెన్‌గానే ఉంటారు."
- విరాట్ కోహ్లీ, టీమ్ఇండియా కెప్టెన్
టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ఇన్స్టాగ్రామ్ వేదికగా శనివారం ప్రకటించాడు. దీనిపై పలువురు ప్రముఖులతో సహా క్రికెట్ అభిమానులు నిర్ఘాంతపోయారు. యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి జరగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించనున్నాడు ధోనీ.