టెస్టు క్రికెట్‌కు మరింత ఆదరణ తీసుకొచ్చేందుకు టెస్టు ఛాంపియన్ షిప్‌ను తీసుకొచ్చింది ఐసీసీ. ప్రతి సిరీస్‌కు కొన్ని పాయింట్లు కేటాయించింది. అయితే ఈ పాయింట్ల విధానాన్ని తప్పుబట్టాడు న్యూజిలాండ్ సారథి విలియమ్సన్. గెలిచిన జట్లకు ఇస్తున్న పాయింట్ల తీరు సరిగా లేదన్నాడు.
"టెస్టు చాంపియన్‌షిప్ అనేది సరికొత్త ప్రయోగం. కానీ పాయింట్ల పద్ధతి సరిగా లేదు. ఈ ఛాంపియన్‌షిప్‌ను ముందుకు తీసుకెళ్లాలంటే ఈ విధానం సరైనది కాదు. దీనిని మరింత గొప్పగా నిర్వహించాలంటే మరిన్ని మార్గాలను వెతకాలి. ప్రస్తుతం ఉన్న పాయింట్ల విధానమైతే నా దృష్టిలో సరైనది కాదు."
-విలియమ్సన్, న్యూజిలాండ్ సారథి
ఐసీసీ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా రెండు టెస్టుల సిరీస్‌లో ఒక్కో మ్యాచ్ గెలిచిన జట్టుకు 60 పాయింట్లు వస్తాయి. అదే ఐదు టెస్టుల సిరీస్‌లో మ్యాచ్ గెలిచిన జట్టుకు 24 పాయింట్లు దక్కుతాయి. అంటే టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా జరిగే ఒక సిరీస్‌ను ఒక జట్టు క్లీన్‌స్వీప్ చేస్తే గరిష్ఠంగా 120 పాయింట్లు సాధిస్తుంది. దీనినే విలియమ్సన్ తప్పుబట్టాడు.