మహేంద్రసింగ్ ధోనీ.. ఈ పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది అతడి జులపాల జుట్టు. కెరీర్ ప్రారంభంలో లాంగ్ హెయిర్‌తో కనిపించిన మహీ తర్వాత విభిన్నమైన హెయిర్‌స్టైల్స్ ట్రై చేశాడు. అయితే అభిమానులు మాత్రం ఆ జులపాల జుట్టుకే బాగా కనెక్టయ్యారు. కానీ ధోనీ సతీమణికి మాత్రం ఆ హెయిర్ స్టైల్ అస్సలు నచ్చదట. ఒకవేళ ఆ సమయంలో తాను మహీని చూసుంటే అతడి ముఖం మళ్లీ చూడకపోయేదానినని తెలిపింది.
లాక్డౌన్ సమయంలో కుటుంబంతో సరదాగా గడుపుతున్నాడు ధోనీ. అతడి సతీమణి సాక్షి సింగ్ తరచుగా మహీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తోంది. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్‌తో లైవ్ చాట్ సెషన్లో పాల్గొంది సాక్షి.. పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఆ సమయంలో ధోనీకి సంబంధించిన ఓ ఫొటో చూపించిన ఇంటర్వ్యూయర్ "ధోనీ లాంగ్ హెయిర్ గుర్తుందా" అని అడిగింది. దానికి సాక్షి ఫన్నీగా సమాధానం చెప్పింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
అది ఓ ప్రకటన చిత్రీకరణ సమయంలో తీసిన ఫొటో అని తెలిపింది సాక్షి. అదృష్టవశాత్తు జులపాల జట్టు ఉన్నప్పుడు తాను ధోనీని చూడలేదని తెలిపింది. ఒకవేళ చూస్తే మళ్లీ అతడిని చూసుండకపోయేదానినని వివరించింది. కానీ ధోనీ లాంగ్ హెయిర్‌ను అందరూ ఇష్టపడతారు కదా అని ఇంటర్వ్యూయర్ అడగ్గా.. జాన్ అబ్రహంకు ఆ హెయిర్ స్టైల్ నప్పుతుంది. కానీ ధోనీకి నప్పదని స్పష్టం చేసింది.