కొంత కాలంగా తన మాటలతో నెట్టింట హాట్ టాపిక్‌గా మారుతున్న పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒకవేళ పాక్ మాజీ సారథి వసీం అక్రమ్ తనను మ్యాచ్ ఫిక్సింగ్ చేయాలని ఒత్తిడి తెచ్చి ఉంటే అతడిని చంపేసే వాడినని అన్నాడు.
"అక్రమ్ ఒకవేళ నన్ను మ్యాచ్ ఫిక్సింగ్ చేయమని చెబితే కచ్చితంగా అతడిని నాశనం చేయడమో లేదా చంపేయడమో చేసేవాడిని. కానీ అతడు నా దగ్గరకు అలాంటి ప్రతిపాదనతో ఎప్పుడూ రాలేదు. నేనెప్పుడూ దేశాన్ని మోసం చేయాలని అనుకోలేదు. నా దగ్గరకు బుకీలు వచ్చిన ప్రతిసారీ వారిని వెనక్కి పంపించాను."
-అక్తర్, పాక్ మాజీ పేసర్
అక్రమ్‌తో కలిసి ఏడెనిమిది సంవత్సరాలు ఆడానని అక్తర్ తెలిపాడు. టాపార్డర్ పని తాను చూసుకుంటానని.. టెయిలెండర్లను ఔట్ చేసే బాధ్యత నీదేనంటూ అక్రమ్ తనతో చెప్పేవాడని గుర్తు చేశాడు.