ఇటీవలే ముగిసిన రంజీ ఫైనల్లో విజయం సాధించిన సౌరాష్ట్ర.. తొలిసారి కప్పు కొట్టింది. జట్టు కెప్టెన్ జయదేవ్ ఉనద్కత్.. సీజన్ ఆసాంతం అద్భుతమైన బౌలింగ్‌తో పాటు సారథిగానూ ఆకట్టుకున్నాడు. మ్యాచ్‌లు గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. అదే జట్టు తరఫున ఆడిన నయావాల్ చెతేశ్వర్ పుజారా.. ఉనద్కత్‌పై ప్రశంసలు కురిపించాడు. త్వరలో అతడు భారత్ జట్టులోకి వస్తాడని అభిప్రాయం వ్యక్తం చేశాడు.
"అవును జయదేవ్ ఈ సీజన్లో అద్భుతంగా బౌలింగ్ చేశాడన్నది అంగీకరిస్తాను. ఒకే సీజన్లో 67 వికెట్లు తీశాడంటే రంజీ ట్రోఫీలో ఇంతకన్నా మంచి ప్రదర్శన ఉండదు. భారత జట్టుకు ఎంపికవ్వాలంటే రంజీ ట్రోఫీకి ఎంతో ప్రాధాన్యముంది" -పుజారా, భారత క్రికెటర్
చివరగా 2018లో బంగ్లాదేశ్‌పై టీమిండియా తరఫున ఆడాడు జయదేవ్. గత కొన్ని సీజన్ల నుంచి ఐపీఎల్ ఆడుతున్నాడు. ఏప్రిల్ 15 నుంచి జరగబోయే 13వ సీజన్‌కు సిద్ధమవుతున్నాడు.