ముక్కోణపు టీ20 సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా మహిళా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో భారత్ భారీ లక్ష్యాన్ని ఛేదించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ మహిళల జట్టు.. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యాన్ని 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది మహిళా టీమిండియా. అద్భుత ఇన్నింగ్స్ ఆడిన ప్రత్యర్థి జట్టు క్రీడాకారిణి గార్డెనర్‌కు 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' లభించింది.
ఛేజింగ్‌లో రాణులు...
భారత జట్టుకు ఛేదనలో మంచి రికార్డు ఉంది. దీన్ని రుజువుచేస్తూ మరో చక్కటి విజయాన్ని ఖాతాలో వేసుకుంది. భారత బ్యాటింగ్‌లో షెఫాలీ 49 (28 బంతుల్లో; 8 ఫోర్లు, 1 సిక్సర్), స్మృతి మంధాన 55 (48 బంతుల్లో; 7 ఫోర్లు) మంచి ఓపెనింగ్ భాగస్వామ్యం ఇచ్చారు. తొలి వికెట్‌కు ఈ జోడీ 85 రన్స్ చేసింది. అయితే షెఫాలీ ఔటయ్యాక స్మృతి నెమ్మిదిగా ఇన్నింగ్స్ నడిపించింది. ఆమెకు రోడ్రిగ్స్ (30), హర్మన్ ప్రీత్ (20*) మంచి సహకారం ఇచ్చారు. దీప్తి శర్మ (11*) చివరిలో మ్యాచ్ ముగించింది.
ఆస్ట్రేలియా బౌలర్లలో ఎలిస్ పెర్రీ, మేఘన్ స్కట్, నికోలా కారే తలో వికెట్ సాధించారు.
-
India too strong at Junction Oval today. We'll be back for a must-win clash against England tomorrow!
— Australian Women's Cricket Team 🏏 (@AusWomenCricket) February 8, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Scorecard: https://t.co/qYZh0acKUR #CmonAussie pic.twitter.com/95Unj6Kzdd
">India too strong at Junction Oval today. We'll be back for a must-win clash against England tomorrow!
— Australian Women's Cricket Team 🏏 (@AusWomenCricket) February 8, 2020
Scorecard: https://t.co/qYZh0acKUR #CmonAussie pic.twitter.com/95Unj6KzddIndia too strong at Junction Oval today. We'll be back for a must-win clash against England tomorrow!
— Australian Women's Cricket Team 🏏 (@AusWomenCricket) February 8, 2020
Scorecard: https://t.co/qYZh0acKUR #CmonAussie pic.twitter.com/95Unj6Kzdd
గార్డెనర్ పోరాటం వృథా..
ఆస్ట్రేలియా జట్టుకు ఆరంభ ఓవర్లోనే షాక్ తగిలింది. ఎదుర్కొన్న మూడో బంతికే డకౌట్‌గా వెనుదిరిగింది కంగారూ జట్టు ఓపెనర్ అలీసా హేలీ. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన గార్డెనర్ (93) రన్స్‌తో ఇన్నింగ్స్‌కు పునాది వేసింది. భారత బౌలర్లను అలవోకగా ఎదుర్కొని పరుగులు రాబట్టింది. మరో ఎండ్‌లో బెత్ మూనే (16), మెక్ లానింగ్ (37), హేన్స్ (11*), ఎలిస్ ఫెర్రీ (13) ఫర్వాలేదనిపించారు.
భారత బౌలర్లలో దీప్తి శర్మ రెండు వికెట్లు తీయగా... రాదా యాదవ్, హర్లీన్ డియోల్, రాజేశ్వరి గైక్వాడ్ తలో వికెట్ ఖాతాలో వేసుకున్నారు.
ఈ విజయంతో ట్రై సిరీస్ రేసులో నిలిచింది భారత జట్టు. రేపు ఇదే వేదికపై ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఆస్ట్రేలియాకు కీలకం కానుంది.