టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ తర్వాత టీ20 ప్రపంచకప్‌ను అందించిన రెండో కెప్టెన్‌గా నిలవడం ఎంతో గౌరవంగా ఉంటుందని అన్నాడు విరాట్ కోహ్లీ. ప్రస్తుతం వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌పై దృష్టి సారిస్తున్నామని తెలిపాడు.
"2020 టీ20 ప్రపంచకప్‌పై దృష్టి సారిస్తున్నాం. రాబోయే 12 నెలలు ఎంతో కీలకం. ఐసీసీ ట్రోఫీని అందుకోవడానికి తీవ్రంగా కృషిచేస్తాం. 2007లో జరిగిన తొలి టీ20 ప్రపంచకప్‌ను భారత్ ముద్దాడింది. ఆ తర్వాత కప్‌ను అందుకున్న రెండో సారథిగా నిలవడం ఎంతో గౌరవంగా ఉంటుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగునున్న మహిళా టీ20 ప్రపంచకప్‌ను భారత్ గెలిస్తే మూడో టైటిల్ కోసం బరిలోకి దిగుతాం. పొట్టి ఫార్మాట్‌కు ఎంపికైన వారంతా తమను తాము నిరూపించుకోవడానికి ఎంతో పట్టుదలతో ఆడుతున్నారు. బలమైన జట్టుతో ఆసీస్‌కు వెళ్తాం"
-విరాట్ కోహ్లీ, టీమిండియా సారథి
ఆస్ట్రేలియాలో వచ్చే ఏడాది అక్టోబరు 18 నుంచి నవంబర్ 15 వరకు టీ-20 ప్రపంచకప్ జరగనుంది. కోహ్లీ సారథ్యంలో టీమిండియా 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్‌కు చేరింది. తుది పోరులో పాక్ చేతిలో ఓటమిపాలైంది. ఇటీవల ఇంగ్లాండ్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో సెమీస్‌కు చేరింది. సెమీఫైనల్లో కివీస్ చేతిలో పరాజయం చెంది ఇంటిముఖం పట్టింది.
ఇవీ చూడండి.. భారత్-దక్షిణాఫ్రికా చివరి టెస్టుకు ధోనీ..!