భారత మాజీ దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్‌కు కెప్టెన్‌గా సరైన గౌరవం దక్కలేదని అభిప్రాయపడ్డాడు మాజీ బ్యాట్స్‌మన్ గౌతమ్ గంభీర్. జట్టుకు మెరుగైన సేవలు అందించినా.. ద్రవిడ్‌ను విస్మరించారని తెలిపాడు. టీమ్ఇండియాలో సచిన్‌తో పోల్చదగిన ప్రభావాన్ని చూపినప్పటికీ దేశంలో ద్రవిడ్‌కు తగిన క్రెడిట్ లభించలేదని తాజాగా వెల్లడించాడు గంభీర్.
"రాహుల్ ద్రవిడ్ నాయకత్వానికి తగిన గౌరవాన్ని ఇవ్వకపోవడం దురదృష్టకరం. మనం సౌరభ్ గంగూలీ, ధోనీ కెప్టెన్సీ గురించి మాట్లాడాం. ఇప్పుడు విరాట్ కోహ్లీ సారథ్యం గురించి చర్చించుకుంటున్నాం. కానీ, టీమ్ఇండియాకు అద్భుతమైన నాయకుడిగా వ్యవహరించిన రాహుల్ ద్రవిడ్‌ను గుర్తించలేకపోయాం. ఆయన రికార్డులను గమనిస్తే ద్రవిడ్‌ను క్రికెటర్‌గా, కెప్టెన్‌గానూ చాలా తక్కువగా చూశారని అర్థమవుతుంది. ఇంగ్లాండ్, వెస్టిండీస్‌లతో సహా మరో 14 నుంచి 15 సిరీస్‌లను ద్రవిడ్ నాయకత్వంలో గెలుపొందాం".
- గౌతమ్ గంభీర్, టీమ్ఇండియా మాజీ క్రికెటర్
రాహుల్ ద్రవిడ్ కెప్టెన్‌గా 79 వన్డేల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించగా.. అందులో 42 విజయాలు ఉన్నాయి. వరుసగా 14 మ్యాచ్‌ల్లో ఛేదనలో విజయం సాధించిన ఘనత ద్రవిడ్ సారథ్యంలోనే సాధ్యమైంది. వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్‌లతో ఆడిన టెస్టు సిరీస్‌ల్లో జట్టుకు గెలుపును అందించాడు.
ద్రవిడ్ తన అంతర్జాతీయ కెరీర్లో ఆడిన 164 టెస్టుల్లో 13,288 పరుగులు చేయగా.. 344 వన్డేల్లో 10,889 రన్స్‌ను నమోదు చేశాడు. 2016 నుంచి 2019 వరకు అండర్-19, భారత 'ఏ' జట్లకు కోచ్‌గా వ్యవహరించాడు. ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీకి డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు.