ETV Bharat / sports

'పేసర్లకు బంతి అనుకూలిస్తే విజయం మాదే'

author img

By

Published : Feb 19, 2021, 10:19 PM IST

పేసర్​కు బంతి అనుకూలిస్తే డే-నైట్ మ్యాచ్​లో విజయం తమదే అని ధీమా వ్యక్తం చేశాడు ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్. భారత్​తో మూడో టెస్టు మ్యాచ్​ జరగనున్న నేపథ్యంలో ఈ విధంగా మాట్లాడాడు.

Mark Wood on day night match
'పేసర్​కు బంతి అనుకూలిస్తే విజయం మాదే'

డే, నైట్​ టెస్టులో భాగంగా పింక్​ బాల్​ను సరైన రీతిలో వినియోగించుకుంటే విజయం తమదే అని ధీమా వ్యక్తం చేశాడు ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్. భారత్​తో జరగనున్న మూడో టెస్టు( ఫిబ్రవరి 24-28) మ్యాచ్​ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశాడు మార్క్.

"జేమ్స్ అండర్సన్, బ్రాడ్​లాంటి దిగ్గజ బౌలర్లు మా జట్టులో ఉన్నారు. అనుకున్నట్లుగా బంతి తిరిగితే మా బౌలర్లు సరైన నైపుణ్యం చూపగలరు. మైదానం కూడా పేసర్లకు అనుకూలంగా ఉంటే మాకు ధైర్యం పెరుగుతుంది. మేం విజయం సాధించగలం కూడా."

-వుడ్, ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్.

భారత్​తో అహ్మదాబాద్​ టెస్టు కోసం బెయిర్​ స్టో, వుడ్​ ఇంగ్లండ్​ జట్టులో చేరారు. నాలుగు మ్యాచ్​ల టెస్టు సిరీస్​లో.. ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. అహ్మదాబాద్​లోని మొతెరా స్టేడియంలో మూడు, నాలుగో టెస్టులు జరగనున్నాయి.

ఇదీ చదవండి:ఐపీఎల్ వేలం: ఫ్రాంఛైజీల ఉత్తమ, అనూహ్య నిర్ణయాలు ఇవే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.