ఐపీఎల్ ప్లేఆఫ్స్‌కు సిద్ధమైన బెంగళూరు జట్టు కెప్టెన్ కోహ్లీ.. బయో బబుల్‌పై కీలక వ్యాఖ్యలు చేశాడు. చాలారోజుల పాటు అందులో ఉండడం ఆటగాళ్లకు కష్టమేనని అన్నాడు. ఈ లీగ్ కోసం గత రెండు నెలలుగా బుడగలోనే ఉన్న అన్ని జట్లలోని భారత ఆటగాళ్లు.. త్వరలో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో సిరీస్ గడువుపై పునరాలోచించాలని విరాట్ బోర్డుకు విజ్ఞప్తి చేశాడు.
"బబుల్‌లో అందరం బాగా గడిపాం. కానీ, చాలాసార్లు అందులోనే ఉండాల్సి వస్తే మాత్రం కష్టంగానే ఉంటుంది. సిరీస్ గడువు పెంచడం, 80 రోజులుగా ఒకే వాతావరణంలో ఉంటే మానసికంగా ఎలాంటి ప్రభావం పడుతుందనే విషయాలు ఆలోచించాలి. లేదా ఆటగాళ్లకు తమ కుటుంబాలను కలిసేందుకు అవకాశాన్ని ఇవ్వాలి. ఇలాంటి చర్యలు తీసుకుని ఆటగాళ్లు మానసికంగా దృఢంగా ఉండేలా చూడాలి"
--కోహ్లీ, టీమ్ ఇండియా కెప్టెన్
ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా తలో మూడు వన్డే, టీ20లు, నాలుగు టెస్టులు ఆడనుంది భారత్. నవంబర్ 27 నుంచి జనవరి 19 వరకు ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి.
ఇదీ చూడండి:అలా చేస్తే కోహ్లీ మరింతగా రెచ్చిపోతాడు: స్టీవ్ వా