టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ... తన సతీమణి అనుష్క శర్మతో కలిసి శీతల దేశం స్విట్జర్లాండ్‌లో విహరిస్తున్నాడు. ప్రస్తుతం అక్కడి నుంచే, వారిద్దరూ తమ అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. మంచు కొండల్లో నిల్చుని ఉన్న ఈ వీడియోలో విరుష్క జంట అందంగా కనిపించింది.
- View this post on Instagram
Happy new year from us to each and every one of you. God bless you all. 🙏❤️😇
">
'అందమైన ప్రదేశం నుంచి మీ అందరికి ముందస్తు శుభాకాంక్షలు' అని విరాట్ అన్నాడు. '2019 మీ అందరికీ సంతృప్తికరంగా గడిచిందని ఆశిస్తున్నా. 2020 మరింత బాగా ఉండాలని కోరుతున్నా. మీ అందరికీ మా ఇద్దరి తరఫున శుభాకాంక్షలు' అని అనుష్క చెప్పింది.
త్వరలో శ్రీలంకతో ప్రారంభమయ్యే టీ20 సిరీస్ ఆడనున్నాడు కోహ్లీ. ఇందులో భాగంగా మూడు మ్యాచ్లు జరగనున్నాయి. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ జరగనుంది.