15 ఏళ్లకుపైగా అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగిన మాజీ క్రికెటర్, అంపైర్ బ్రూస్ ఆక్సెన్ ఫోర్డ్ రిటైర్ కానున్నారు. ఈ మేరకు ఐసీసీ గురువారం స్పష్టం చేసింది.
2006లో గబ్బా వేదికగా ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన టీ-20తో తొలిసారి అంపైరింగ్ బాధ్యతలు నిర్వర్తించాడు బ్రూస్. 2012 నుంచి ఐసీసీ అంపైర్ ఎలైట్ ప్యానెల్లో సభ్యుడిగా ఉన్నాడు. దాదాపు 62 టెస్టు మ్యాచ్‌లకు అంపైర్‌గా వ్యవహరించాడు. చివరగా బ్రిస్బేన్‌లో ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరిగిన చివరి టెస్టుకు ప్రాతినిధ్యం వహించాడు.
''నేను నా అంతర్జాతీయ కెరీర్ ను చూసుకుంటే చాలా గర్వంగా ఫీలవుతా. నేను దాదాపు 200 అంతర్జాతీయ మ్యాచ్ లకు ప్రాతినిధ్యం వహించానంటే నమ్మలేకపోతున్నా. ఇన్నేళ్లుగా నాకు సహకరించిన అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ), క్రికెట్ ఆస్ట్రేలియా, ఎలైట్ ప్యానెల్ లోని సహచరులు అందరికీ కృతజ్ఞతలు.''
-బ్రూస్ ఆక్సెన్ ఫోర్డ్, అంపైర్.