దక్షిణాఫ్రికాలోని బ్లూమ్‌ఫోంటీన్ వేదికగా కుర్రాళ్ల ప్రపంచకప్‌లో భారత్.. తన పోరు మొదలుపెట్టింది. ఇవాళ శ్రీలంకతో టైటిల్ వేటను ఆరంభించింది. టాస్ గెలిచిన లంక జట్టు.. బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే గత నాలుగు ప్రపంచకప్పుల్లో రెండు టైటిళ్లు నెగ్గడం, ఓసారి రన్నరప్‌గా నిలవడం ద్వారా ఈ మ్యాచ్‌లోనూ ఫేవరెట్‌గా బరిలోకి దిగింది 'మెన్ ఇన్ బ్లూ'.
డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ ఆశలకు యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ కీలకం కానున్నాడు. కెప్టెన్ ప్రియమ్‌గార్గ్ జట్టులో అందరికన్నా అనుభవజ్ఞుడు. తెలుగు ఆటగాడు తిలక్ వర్మ జట్టులో ఉన్నాడు.
భారత యువ జట్టు...
ప్రియమ్ గార్గ్ (కెప్టెన్), ధృవ్చంద్ జురెల్ (వైస్ కెప్టెన్, కీపర్), యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, దివ్యాంశ్ సక్సేనా, సిద్దేశ్ వీర్, శుభంగ్ హెగ్డే, సుశాంత్ మిశ్రా,రవి బిష్నోయ్, ఆకాశ్ సింగ్, కార్తీక్ త్యాగి
శ్రీలంక జట్టు...
కమల్ మిషారా(కెప్టెన్), నవోద్ పరణవితన, రవిండు రసంత, తవీష, నిపున్(కెప్టెన్), సోనాల్ దినుషా, కవిండు నదీషన్, ఆషియన్ డేనియల్, అంశీ డిసిల్వా, దిల్షాన్, మదుశంక,మతీష పతిరణ