ETV Bharat / sports

వార్నర్​ దూకుడు అడ్డుకున్న పైన్​.. నెటిజన్ల ఫైర్​

author img

By

Published : Nov 30, 2019, 3:04 PM IST

Updated : Nov 30, 2019, 4:54 PM IST

అడిలైడ్ వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్న డేనైట్ టెస్టులో ఆస్ట్రేలియా ఓపెనర్​ డేవిడ్​ వార్నర్​ ట్రిపుల్​ సెంచరీతో రాణించాడు. ఈ మ్యాచ్​లో 418 బంతుల్లో 335* పరుగులతో అజేయంగా నిలిచాడీ స్టార్​ బ్యాట్స్​మన్​. అయితే ఇతడి ఆటతీరు చూస్తే బ్రియాన్​ లారా(400) రికార్డు బ్రేక్​ అవుతుందని అభిమానులు ఆశించగా.. దానికి చెక్​ పెట్టాడు ఆసీస్​ కెప్టెన్​ టిమ్​ పైన్​.

tim-paine-shocking-decision-to-declared-innings-ahead-warner-going-to-beat-lara-400-runs
వార్నర్​ దూకుడు అడ్డుకున్న టిమ్​ పైన్​... నైటిజన్లు ఫైర్​

బాల్ ట్యాంపరింగ్ కారణంగా ఏడాది నిషేధం తర్వాత యాషెస్​ సిరీస్​లో రీఎంట్రీ ఇచ్చిన వార్నర్​.. ఆ మ్యాచ్​ల్లో దారుణంగా విఫలమయ్యాడు. అయితే ఆ తర్వాత పాకిస్థాన్​తో జరుగుతోన్న మ్యాచ్​ల్లో మళ్లీ పుంజుకున్నాడు. పాక్​తో జట్టుతో జరుగుతున్న రెండో టెస్టులో త్రిశతకం చేశాడు. కెరీర్​లో అత్యధిక వ్యక్తిగత స్కోరు(335*) నమోదు చేశాడు.

tim-paine-shocking-decision-to-declared-innings-ahead-warner-going-to-beat-lara-400-runs
ట్రిపుల్​ సెంచరీ చేసిన వార్నర్​

దూకుడైన బ్యాటింగ్​తో అలవోకగా 300 పరుగుల మార్కు దాటిన వార్నర్​.. కచ్చితంగా 400 పరుగులు చేసి విండీస్ దిగ్గజ ఆటగాడు బ్రియన్ లారా రికార్డు బ్రేక్ చేస్తాడని అంతా భావించారు. కానీ ఆ అంచనాలకు చెక్​ పెడుతూ అనూహ్యంగా 589 పరుగుల వద్ద ఇన్నింగ్స్​ డిక్లేర్​ ఇచ్చాడు ఆసీస్​ సారథి టిమ్​ పైన్​.

ఈ నిర్ణయంతో ఆశ్చర్యపడిన క్రికెట్​ అభిమానులు అతడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కెరీర్​లో ఓ అద్భుతమైన మైలురాయిని అందుకునే దిశగా వెళ్తుంటే.. పైన్​ దాన్ని చెడగొట్టాడని నెటిజన్లు మీమ్స్​తో ట్రోల్ చేస్తున్నారు.

ఆట రెండో రోజే అయినా.. అంత తొందరగా ఎందుకు డిక్లేర్​ తీసుకోవడం అని పైన్​పై అభిమానులు మండిపడుతున్నారు. పాకిస్థాన్​ బౌలర్లు ఏమి చేయలేకపోతున్నారని.. అందువల్ల ఆసీస్​ సారథి సహాయం చేశాడని వ్యంగ్యంగా ట్వీట్లు చేస్తున్నారు.

రికార్డులివే...

  1. వార్నర్‌కు టెస్టుల్లో ఇదే తొలి ట్రిపుల్‌ సెంచరీ. ఆస్ట్రేలియా తరఫున ఈ ఘనత సాధించిన ఏడో బ్యాట్స్‌మన్‌గా వార్నర్‌ నిలిచాడు.
  2. పాకిస్థాన్‌పై ట్రిపుల్‌ సెంచరీ సాధించిన రెండో ఆసీస్‌ ఆటగాడిగా గుర్తింపు సాధించిన వార్నర్‌.
  3. ఓవరాల్‌గా టెస్టు ఫార్మాట్‌లో ట్రిపుల్‌ సెంచరీ సాధించిన 16వ ఆటగాడు వార్నర్‌. డే/నైట్‌ టెస్టులో అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డును తన పేరిటే లిఖించుకున్నాడు. గతంలో పాకిస్థాన్​ కెప్టెన్​ అజహర్‌ అలీ(302 నాటౌట్‌) పేరిట ఈ రికార్డు ఉండగా దాన్ని వార్నర్‌ బ్రేక్‌ చేశాడు.
  4. టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత పరుగుల రికార్డునూ వార్నర్‌ ఖాతాలో వేసుకున్నాడు.

ఐపీఎల్​తోనే మళ్లీ...

బాల్​ ట్యాంపరింగ్​ వివాదంతో ఏడాది ఆటకు దూరమైన వార్నర్​.. ఐపీఎల్​తోనే మళ్లీ మైదానంలో అడుగుపెట్టాడు. ఈ టోర్నీలో దాదాపు 600లకు పైగా పరుగులు చేసి అత్యధిక స్కోరు చేసిన ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు. సన్​రైజర్స్​ హైదరాబాద్​ సెమీస్​ వెళ్లడంలో కీలకపాత్ర పోషించాడు.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
The Hague - 29 November 2019
++NIGHT SHOTS++
1. Various of police officers and vehicles at scene of stabbing
2. SOUNDBITE (English) Marije Kuiper, Police spokeswoman:
"Around a quarter to eight (7:45pm), we received a notion that there was a stabbing incident here. Three people are hurt and we are looking for a suspect right now."
3. Police at the scene of the stabbing
STORYLINE:
Dutch police say they are still looking for a suspect after a stabbing that left three people wounded at a busy shopping district in The Hague on Friday.
The incident took place on a main shopping street, which was busy with people looking for Black Friday deals.
Further details were not immediately available.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Nov 30, 2019, 4:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.