ETV Bharat / sports

'గత సిరీస్​లో భారత్ మాకంటే బలంగా ఉంది' - 'గత సిరీస్​లో భారత్ మాకంటే బలంగా ఉంది'

టీమ్ఇండియాతో జరగబోయే టెస్టు సిరీస్​లో సత్తాచాటుతామని ఆశాభావం వ్యక్తం చేశాడు ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్. గత సిరీస్​లో తమ కంటే భారత్ అన్ని విభాగాల్లో పటిష్ఠంగా ఉందని తెలిపాడు.

This summer is a chance to rectify our mistakes from 2018-19, says Mitchell Starc
'గత సిరీస్​లో భారత్ మాకంటే బలంగా ఉంది'
author img

By

Published : Dec 15, 2020, 12:17 PM IST

టీమ్ఇండియాతో జరిగే టెస్టు సిరీస్​ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్. గత సిరీస్​లో జరిగిన పొరపాట్లను చక్కదిద్దుకుని ఈ సిరీస్​లో రాణిస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు. కోహ్లీసేన గతేడాది తమ జట్టు కంటే అన్ని విభాగాల్లోనూ బలంగా ఉందని కొనియాడాడు.

"ఆస్ట్రేలియా గడ్డపై సిరీస్​ను కోల్పోతామని ఎప్పుడూ అనుకోలేదు. 2018-19 సిరీస్​లో మా జట్టు కంటే భారత్ అన్ని విభాగాల్లోనూ బలంగా ఉంది. ఇందులో దాచిపెట్టాల్సిందేమీ లేదు. ఈ సిరీస్​లో గత సిరీస్​లో జరిగిన తప్పుల్ని సరిదిద్దుకుని రాణించడానికి ప్రయత్నిస్తాం."

-స్టార్క్, ఆసీస్ బౌలర్

గతేడాది కోహ్లీ సారథ్యంలో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన కోహ్లీసేన టెస్టు సిరీస్​ను గెలుచుకుని చరిత్ర సృష్టించింది. కంగారూల గడ్డపై తొలి టెస్టు సిరీస్ విజయం సాధించింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.