టీమ్ఇండియా కెప్టెన్ కోహ్లీ.. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌కు ఎంత ప్రాధాన్యత ఇస్తాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇదే విషయమై మాట్లాడిన దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ షాన్ పొలాక్.. విరాట్‌కు ఫిట్‌నెస్‌పై ఉన్న శ్రద్ధ గురించి వివరిస్తూ గతంలో జరిగిన ఓ సందర్భాన్ని గుర్తుచేసుకున్నాడు.
"భారత్-దక్షిణాఫ్రికా మధ్య గతంలో జరిగిన ఓ సిరీస్‌కు నేను కామెంటేటర్‌గా చేశాను. అందులో టీమ్ఇండియా ఓ మ్యాచ్ గెలిచాక.. ఆటగాళ్లందరూ హోటల్‌కు వెళ్లిపోయారు. నేనేమో జిమ్‌కు వెళ్లాను. అక్కడ కోహ్లీని చూసి ఆశ్చర్యపోయాను. ఎవరైనా మ్యాచ్ గెలిస్తే ఆనందంతో సంబరాలు చేసుకుంటారు. కానీ విరాట్ జిమ్‌లో కసరత్తులు చేస్తూ కనిపించాడు. ధోనీ కెప్టెన్ అయిన తర్వాత జట్టులో మార్పు తీసుకొచ్చాడు. మహీ తనను తాను సన్నద్ధం చేసుకోవడం, జట్టును సిద్ధం చేసిన తీరు ప్రశంసనీయం. ఇప్పడు దానినే కోహ్లీ కొనసాగిస్తున్నాడు. ధోనీ తీసుకొచ్చిన దూకుడును కోహ్లీ మరింత పెంచాడు"
- షాన్ పొలాక్, దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్
ప్రస్తుతం ఐపీఎల్ ఆడుతున్న కోహ్లీ.. త్వరలో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్నాడు. ఇందులో భాగంగా తలో మూడు టీ20, వన్డేలు, నాలుగు టెస్టులు ఆడనున్నాయి భారత్-ఆసీస్. నవంబరు చివరి వారం నుంచి మ్యాచ్‌లు మొదలు కానున్నాయి.
ఇదీ చూడండి పంజాబ్ వరుస విజయాలు.. రహస్యం అదే!