గురువారం వెస్టిండీస్‌తో తలపడనుంది టీమిండియా. ఈ మ్యాచ్‌లో గేల్‌ను ఇబ్బంది పెట్టేందుకు షమి కంటే భువీనే సరైన బౌలర్ అని చెప్పాడు మాజీ క్రికెటర్ సచిన్ తెందూల్కర్. అతడిపై ప్రశంసలు కురిపించాడు.
"భువనేశ్వర్ గాయం నుంచి కోలుకోవడం ఆనందించే అంశం. అతడ్ని చూస్తుంటే పూర్తి విశ్వాసంతో ఉన్నాడని అర్ధమవుతోంది. గురువారం జరిగే వెస్టిండీస్-టీమిండియా మ్యాచ్‌లో షమి, భువీ ఇద్దరిలో ఎవరో ఒకర్నే ఆడించాలంటే నేను కచ్చితంగా భువనేశ్వర్నే తీసుకుంటాను. అతడి బౌలింగ్‌లో క్రిస్ గేల్ ఇబ్బంది పడతాడు. నేను ఆడిన చివరి టెస్టులో ఈ విషయాన్ని గమనించాను" - సచిన్ తెందూల్కర్
2013 ముంబయి వేదికగా చివరి టెస్టు మ్యాచ్ ఆడాడు మాస్టర్ బ్లాస్టర్. మొత్తంగా 200 టెస్టుల్లో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు.
ఇది చదవండి: ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌కు తెందుల్కర్ బౌలింగ్