ETV Bharat / sports

టీమ్​ఇండియా ప్రదర్శన స్ఫూర్తిదాయకం: మోదీ

టీమ్​ఇండియాపై ప్రశంసల జల్లు కురిపించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆస్ట్రేలియాపై ఓటమి అనంతరం పుంజుకున్న తీరు అద్వితీయమని 'మన్​ కీ బాత్' వేదికగా​ కొనియాడారు.

Team's hard work was inspiring: PM Modi hails India's historic win over Australia
టీమ్​ఇండియా ప్రదర్శన స్ఫూర్తిదాయకం: ప్రధాని మోదీ
author img

By

Published : Jan 31, 2021, 4:16 PM IST

ఆస్ట్రేలియాతో టెస్ట్​ సిరీస్​లో చారిత్రక విజయం సాధించిన భారత క్రికెట్​ జట్టును మరోమారు అభినందించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. జట్టు పోరాటతత్వం ఎంతో అభినందనీయమని కొనియాడారు. 'మన్​ కీ బాత్' కార్యక్రమం సందర్భంగా ఈ వ్యాఖ్యాలు చేశారు మోదీ.

Team's hard work was inspiring: PM Modi hails India's historic win over Australia
టీమ్​ఇండియా

"క్రికెట్​ ప్రపంచం నుంచి ఈ నెలలో శుభవార్త అందింది. ఆరంభంలో ఎదురుదెబ్బలు తిన్నా.. అద్వితీయంగా పుంజుకొని ఆస్ట్రేలియాలో టెస్ట్​ సిరీస్​ గెలిచాం. మన జట్టు కఠోర శ్రమ, సమష్టి కృషి ఎంతో స్ఫూర్తిదాయకం." అని ప్రధాని అన్నారు.

మోదీ ప్రశంసలకు కృతజ్ఞతలు తెలియజేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ). "మీ ప్రశంసలకు, ప్రోత్సాహానికి ధన్యవాదాలు మోదీజీ," అని ట్వీట్ చేసింది.

ఆస్ట్రేలియా కంచుకోట గబ్బా మైదానాన్ని కైవసం చేసుకుని టీమ్​ఇండియా చరిత్ర సృష్టించింది. 32ఏళ్ల తర్వాత ఆసీస్​ను ఆ మైదానంలో ఓడించి చారిత్రక విజయం నమోదు చేసింది. అడిలైడ్​లో తొలి టెస్ట్​లో ఘోరంగా ఓడినా.. అద్భుతంగా పుంజుకొని 2-1తో సిరీస్​ దక్కించుకుంది.

ఇదీ చూడండి: 'ఇంగ్లాండ్​తో టెస్టు సిరీస్​లో భారతే ఫెవరేట్​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.