తుపాను హెచ్చరికలు ఉన్నప్పటికీ భారత్, బంగ్లా క్రికెటర్లు రెండో టీ20 కోసం తీవ్రంగా కసరత్తులు చేస్తున్నారు. రాజ్‌కోట్ వేదికగా రేపు(గురువారం) జరగనున్న ఈ మ్యాచ్‌లో గెలిచి తీరాలని రోహిత్ సేన భావిస్తోంది. ఇందుకోసం గత రెండు రోజులుగా మైదానంలో తీవ్రంగా చెమటోడ్చారు భారత ఆటగాళ్లు.
బుధవారం జరిగిన ప్రాక్టీసు సెషన్‌కు ఎటువంటి అంతరాయం కలగలేదు. వాతావరణం పొడిగా ఉండటం వల్ల క్రికెటర్లు.. విపరీతంగా నెట్స్‌లో శ్రమించారు. రోహిత్ శర్మ, సంజూ శాంసన్, శ్రేయస్ అయ్యర్ ప్రాక్టీసు చేస్తూ కనిపించారు. కేఎల్ రాహుల్, పంత్, కృనాల్ పాండ్య, వాషింగ్టన్ సుందర్ నెట్స్‌లో సాధన చేశారు.
-
When @RishabhPant17 & @ShreyasIyer15 are batting in tandem 💥💥👌🏻🔝 #TeamIndia #INDvBAN @Paytm pic.twitter.com/ebnKMA2JTI
— BCCI (@BCCI) November 6, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">When @RishabhPant17 & @ShreyasIyer15 are batting in tandem 💥💥👌🏻🔝 #TeamIndia #INDvBAN @Paytm pic.twitter.com/ebnKMA2JTI
— BCCI (@BCCI) November 6, 2019When @RishabhPant17 & @ShreyasIyer15 are batting in tandem 💥💥👌🏻🔝 #TeamIndia #INDvBAN @Paytm pic.twitter.com/ebnKMA2JTI
— BCCI (@BCCI) November 6, 2019
ఇప్పటికే మైదానం సిద్ధం చేసినట్లు సౌరాష్ట్ర క్రికెట్ సంఘం తెలిపింది. అంతేకాకుండా వాతావరణ పరిస్థితులను నిరంతరం గమనిస్తున్నామని... కచ్చితంగా మ్యాచ్ నిర్వహించేందుకు వీలుంటుందని ధీమా వ్యక్తం చేసింది. ఒకవేళ మ్యాచ్రోజు ఉదయం వాన పడినా సాయంత్రానికి గ్రౌండ్ సిద్ధం చేస్తామని మైదాన సిబ్బంది అన్నారు.
దిల్లీలో వేదికగా జరిగిన తొలి టీ20లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది బంగ్లాదేశ్. తొలిసారి ఈ ఫార్మాట్లో టీమిండియాపై గెలిచింది.
రెండో టీ20కి వర్షం ముప్పు పొంచి ఉంది. గురువారం వేకువజామున 'మహా' తుపాను గుజరాత్‌లోని డయు, పోర్‌బందర్ మధ్య తీరం దాటనుందని వాతావరణ శాఖ తెలిపింది.