దేశవ్యాప్తంగా హోలీ సందడి నెలకొంది. కరోనా వైరస్ ప్రభావంతో సహజ సిద్ధమైన రంగులనే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. సినీ తారలు, క్రీడాకారులు తమ కుటుంబసభ్యులతో వేడుకలు జరుపుకొంటున్నారు.
టీమ్‌ఇండియా క్రికెటర్లు కూడా రంగుల పండగను జరుపుకొన్నారు. తమ కుటుంబ సభ్యులతో కలిసి తీసుకున్న చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్‌చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. పాండ్య సోదరులు తమ ప్రియ సఖులతో కలిసి హోలీ వేడుక చేసుకున్నారు. శిఖర్ ధావన్, హర్భజన్ సింగ్, దీపక్ చాహర్, విరాట్ కోహ్లీ అభిమానులకు హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు.