ఈ ఏడాదికి ఐపీఎల్ స్పాన్సర్‌షిప్ నుంచి తప్పుకున్న వివో స్థానంలోకి వచ్చేందుకు టాటా మోటార్స్, డ్రీమ్ ఎలెవన్, అన్‌అకాడమీ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ మూడూ ఐపీఎల్-13వ సీజన్ టైటిల్ స్పాన్సర్‌షిప్ కోసం శుక్రవారం బిడ్‌లు వేశాయి. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారి ఒకరు ధ్రువీకరించారు. ఈ బిడ్‌లు దాఖలు చేయడానికి శుక్రవారమే ఆఖరి రోజు.
వీటితో పాటు ఐపీఎల్-13వ సీజన్ టైటిల్ స్పాన్సర్‌షిప్ కోసం రేసులో ఉన్న ఇతర సంస్థలేవన్నది బయటికి రాలేదు. ఈ నెల 18న బిడ్‌లు తెరుస్తారు. దేశంలో కొన్ని నెలలుగా చైనా వ్యతిరేక ఉద్యమం నడుస్తున్న నేపథ్యంలో ఆ దేశానికి చెందిన వివో ఈ ఏడాదికి ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్ నుంచి తప్పుకుంది. ఆ సంస్థ ఏటా బీసీసీఐకి రూ.440 కోట్లు చెల్లిస్తోంది.
ఇది చూడండి 'భారత ఆటగాళ్లు నా బౌలింగ్‌కు భయపడేవారు'