ETV Bharat / sports

'వీసాలపై పీసీబీ డిమాండ్​ ఆశ్చర్యకరం' - 'పీసీబీ వ్యాఖ్యలు ఆశ్చర్యంగా ఉన్నాయి'

టీ20 ప్రపంచ కప్​ కోసం పీసీబీ ఛైర్మన్ ఎహ్సాన్ మణి చేసిన డిమాండ్​ తమను ఆశ్చర్యానికి గురి చేసిందని బీసీసీఐ తెలిపింది. ఇవి అపరిపక్వతతో కూడిన వ్యాఖ్యలని అసంతృప్తి వ్యక్తం చేసింది.

T20 WC: Mani's comments on visa assurance for Pak players surprising, says BCCI official
'పీసీబీ వ్యాఖ్యలు అపరిపక్వతతో కూడినవి'
author img

By

Published : Mar 1, 2021, 3:23 PM IST

Updated : Mar 1, 2021, 4:19 PM IST

టీ20 వరల్డ్​కప్​ కోసం వీసాల మంజూరు విషయంపై హామీ ఇవ్వాలని పాక్​ క్రికెట్ బోర్డు చేసిన డిమాండ్​ తమను ఆశ్చర్యానికి గురి చేసిందని బీసీసీఐ తెలిపింది. ఈ తరహా వ్యాఖ్యలు అపరిపక్వతతో కూడినవని పేర్కొంది.

ఈ ఏడాది అక్టోబర్​-నవంబర్​లో భారత్ వేదికగా టీ20 ప్రపంచ కప్​ జరగనుంది. 'టోర్నీ సందర్భంగా తమ ఆటగాళ్లు, జర్నలిస్టులు, అభిమానులకు వీసాలు మంజూరు చేయాలి' అని పీసీబీ ఛైర్మన్​ ఎహ్సాన్ మణి డిమాండ్​ చేశారు. ఈ విషయంలో స్పష్టత ఇవ్వాలని ఐసీసీకి ఓ లేఖను రాశారు.

"ఎహ్సాన్​ మణి చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యానికి గురిచేశాయి. ఆయనకు సౌరభ్​ గంగూలీతో మంచి వృత్తిగత సంబంధాలు ఉన్నాయి. ఆయనొక పెద్ద మనిషి. కరోనా సమయంలో సౌరభ్​కు మార్గదర్శిగా వ్యవహరించారు. అలాంటి వ్యక్తి నుంచి ఈ తరహా వ్యాఖ్యలు అపరిపక్వతతో కూడినవని భావించొచ్చు" అని బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నాడు.

"టీ20 టోర్నీ నుంచి నిష్క్రమించే ప్రయత్నాల్లో భాగంగానే మణి ఈ తరహా వ్యాఖ్యలు చేశారనిపిస్తోంది. ఒక బోర్డు ఒక విషయంపై కచ్చితమైన హామీ ఇచ్చే నియమమేమీ లేదని వారికి తెలుసు. బహుశా, ఈ అంశాన్ని రాజకీయ సమస్యగా మార్చాలని చూస్తున్నారేమో."

- బీసీసీఐ అధికారి

"భారత దేశంలో అంతర్జాతీయ క్రీడలలో పాల్గొనడానికి అథ్లెట్లు ఉన్న అన్ని దేశాలు అర్హులే. వారికి వీసాల మంజూరు చేస్తాం" అని 2019 జూన్​ 18న అప్పటి క్రీడా కార్యదర్శి రాధే శ్యామ్​ స్పష్టంగా పేర్కొన్నారు.

ఇదీ చదవండి: డబ్ల్యూటీసీలో భారత్​ ఫైనల్​ చేరితే ఆసియా కప్​ వాయిదా!

Last Updated : Mar 1, 2021, 4:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.