ETV Bharat / sports

'ధోనీని అర్థం చేసుకునేందుకు ఆరేళ్లు పట్టింది'

author img

By

Published : Jul 3, 2020, 4:06 PM IST

టీమ్​ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ గురించి చెప్పిన బౌలర్ ఇషాంత్ శర్మ.. అతడిని అర్థం చేసుకునేందుకు తనకు ఆరేళ్ల సమయం పట్టిందని అన్నాడు. మహీతో మాట్లాడితే చాలా విషయాలు తెలుసుకోవచ్చని తెలిపాడు.

'ధోనీని అర్థం చేసుకునేందుకు ఆరేళ్లు పట్టింది'
ధోనీ ఇషాంత్

2007 నుంచి టీమ్​ఇండియాకు ఆడుతున్నా సరే 2013 తర్వాతే ధోనీని అర్థం చేసుకున్నానని సీనియర్ బౌలర్ ఇషాంత్ శర్మ చెప్పాడు. యువ క్రికెటర్లతో మహీ వ్యవహరించే తీరుకు తాను ముగ్దుడైనట్లు పేర్కొన్నాడు. స్టార్​స్పోర్ట్స్​లోని 'క్రికెట్ కనెక్టడ్' కార్యక్రమంలో మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించాడు.

"తొలినాళ్లలో ధోనీతో ఎప్పుడో ఓసారి మాత్రమే మాట్లాడేవాడ్ని. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత అతడిని అర్ధం చేసుకోవడం మొదలుపెట్టా. మైదానంతో పాటు బయట, యువక్రికెటర్లతో మహీ వ్యవహరించే తీరు చాలా బాగుంటుంది. ఎప్పుడైనా సరే అతడికి గదికి వెళ్లొచ్చు. కావాలంటే షమిని అడగండి. ధోనీతో మాట్లాడితే క్రికెట్​తో పాటే చాలా విషయాలు తెలుసుకోవచ్చు" -ఇషాంత్ శర్మ, భారత సీనియర్ బౌలర్

ఇషాంత్.. టీమ్​ఇండియా తరఫున ధోనీ సారథ్యంలోనే ఎక్కువగా ఆడాడు. 2016లో చివరి వన్డే, 2013లో చివరి అంతర్జాతీయ టీ20 మ్యాచ్​లో పాల్గొన్నాడు. అయితే భారత టెస్టు జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా ఇప్పటివరకు కొనసాగుతూ వస్తున్నాడు.​ 97 టెస్టులు, 80 వన్డేలు, 14 టీ20లు ఆడిన ఇషాంత్.. మొత్తంగా 420 వికెట్లు తీశాడు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.