పల్లెకెలె వేదికగా న్యూజిలాండ్తో జరిగిన తొలి టీ-ట్వంటీ మ్యాచ్లో అద్భుత రికార్డు సాధించాడు శ్రీలంక పేసర్ లసిత్ మలింగ. ఆదివారం జరిగిన ఈ పోరులో 2 వికెట్లు తీసిన మలింగ.. అంతర్జాతీయ టీ-20 కెరీర్లో 99వ వికెట్ సాధించాడు. ఈ క్రమంలో ఈ ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. ఇతడి తర్వాత పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అఫ్రిది 98 వికెట్లతో ఉన్నాడు.
2011లో టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన మలింగ.. ఈ జులైలోనే వన్డేలకు వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం లంక తరఫున టీట్వంటీలు మాత్రమే ఆడుతున్నాడు.
అయినప్పటికీ.. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. శ్రీలంక నిర్దేశించిన 175 పరుగుల లక్ష్యాన్ని 19.3 ఓవర్లలోనే ఛేదించింది. గ్రాండ్హామ్ 44, రాస్ టేలర్ 48 పరుగులతో రాణించారు.
అంతకుముందు లంక బ్యాటింగ్లో ఓపెనర్ కుశాల్ మెండిస్ 79 పరుగులు చేశాడు. మిగతా బ్యాట్స్మెన్ పరుగులు చేయడంలో విఫలమయ్యారు.
ఇది చదవండి: ఆ రికార్డు కోహ్లీ వల్లే సాధ్యమైంది: బుమ్రా