టీమ్ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్‌పై ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ మండిపడ్డాడు.
2019 వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో.. భారత్ 31 పరుగుల తేడాతో ఓడిపోయిన సంఘటన గురించి తన జీవితచరిత్ర 'ఆన్ ఫైర్' పుస్తకంలో ప్రస్తావించాడు బెన్‌స్టోక్స్. అది ధోనీ తప్పిదం వల్లే జరిగినట్లు ఆరోపించాడు. ఇదే విషయాన్ని పాక్ మాజీ క్రికెటర్లు అనేకసార్లు లేవనెత్తారు. అయితే తాజా ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి మాట్లాడిన శ్రీశాంత్.. బెన్‌స్టోక్స్‌పై విరుచుకుపడ్డాడు.
"ధోనీ ఏదీ సాధారణంగా మర్చిపోడు. కెరీర్‌లో ఇంకెప్పుడూ మహీకి ఎదురుపడకూడదని ప్రార్థించుకో. అతడో ప్రమాదకరమైన ఆటగాడు. ఇంగ్లాండ్-భారత్ మ్యాచ్ లేదా ఐపీఎల్లో ఎదురుపడితే మాత్రం నీ కెరీర్‌కు అతడు ముగింపు పలుకుతాడు. ఇప్పటివరకు నవ్వు బాగా సంపాదించి ఉండవచ్చు.. కానీ అవన్నీ కనుమరుగైపోతాయి. జాగ్రత్త."
-శ్రీశాంత్, టీమ్ఇండియా బౌలర్.
వాస్తవానికి ఆ మ్యాచ్‌లో భారత్ గెలిచి ఉంటే.. పాకిస్థాన్ సెమీస్ రేసులో నిలిచేది. కానీ.. టీమ్ఇండియా ఓడిపోవడం వల్ల పాక్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. పాక్‌ను రేస్ నుంచి తప్పించడానికే భారత్ జట్టు ఆ మ్యాచ్‌లో ఉద్దేశపూర్వకంగా ఓడిపోయిందని ఇప్పటికీ పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు ఆరోపణలు గుప్పిస్తూనే ఉన్నారు.
ఇద చూడండి :పోర్న్‌స్టార్‌గా మారిన మహిళా కార్ రేసర్