ETV Bharat / sports

'త్రీటీ క్రికెట్'​ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే​! - Solidarity Cup schedule

దక్షిణాఫ్రికాలో నిర్వహించనున్న త్రీటీ క్రికెట్​ పోటీ జులై18కి వాయిదా పడింది. లాక్​డౌన్​ తర్వాత ఆ దేశంలో ప్రత్యక్షంగా ప్రసారమయ్యే తొలి క్రీడా కార్యక్రమం ఇదే కావడం వల్ల.. క్రికెట్​ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Solidarity Cup match now to be held on July 18 in Centurion
'త్రీటీ క్రికెట్'​ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే​!
author img

By

Published : Jul 1, 2020, 8:06 PM IST

లాక్​డౌన్​ సడలింపుల్లో భాగంగా దక్షిణాఫ్రికాలో తిరిగి ప్రారంభం కావాల్సిన '3టీ క్రికెట్'​ పోటీ జులై 18కి వాయిదా పడింది. స్వదేశానికి చెందిన 24 మంది క్రికెటర్లను ఎంపిక చేసుకుని ఈ మ్యాచ్​ను నిర్వహించనున్నారు. జూన్​ 27న ఈ టోర్నీ జరగాల్సి ఉండగా.. ప్రస్తుతం ఇంకొంత సమయం అవసరమని సఫారీ క్రికెట్​ బోర్టు(సీఎస్​ఏ) భావిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది.

Solidarity Cup match now to be held on July 18 in Centurion
త్రీటీ క్రికెట్​

"టీవీ స్క్రీన్​పై మళ్లీ క్రికెట్​ ప్రత్యక్ష ప్రసారం చూడటానికి ఎంతో ఆసక్తిగా ఉన్నా. కరోనా వైరస్​తో ప్రభావితులైన వారికి నిధులు సేకరించడమే ఈ టోర్నీ ప్రధాన లక్ష్యం. అందుకు జులై 18న నెల్సన్​ మండేలా జయంతి కంటే మంచి రోజు ఉంటుందని నేను అనుకోవడం లేదు. మ్యాచ్​కు ఇంకా మూడు వారాలు ఉంది. కాబట్టి ఆటగాళ్లు మెరుగయ్యేందుకు ఈ సమయం ఉపయోగపడుతుంది."

డా.జాక్వెన్​ ఫాల్​, సీఎస్​ఏ చీఫ్​ ఎగ్జిక్యూటీవ్​

ఇందులో జరిగే ఒకే మ్యాచ్​లో మూడు జట్లు పోటీ పడనున్నాయి. ఒక్కో జట్టులో 8 మంది ఆటగాళ్లు మాత్రమే భాగం కానున్నారు. లాక్​డౌన్​ తర్వాత దక్షిణాఫ్రికాలో ప్రత్యక్షంగా ప్రసారమయ్యే తొలి క్రీడా కార్యక్రమం ఇదే కావడం వల్ల.. క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెంచూరియన్​లోని సూపర్ ​స్పోర్ట్​ స్టేడియం ఈ మ్యాచ్​కు వేదిక కానుంది.

సీఎస్​ఏ

3టీ పోటీలో సాలిడారిటీ కప్​ కోసం ఈగల్స్, కింగ్​ ఫిషర్స్​, కైట్స్ జట్లు పోటీ పడనున్నాయి. ఈగల్స్​ టీమ్​కు కెప్టెన్​గా ఏబీ డివిలియర్స్​, కింగ్​ ఫిషర్స్​ జట్టు కెప్టెన్​గా రబాడా, కైట్స్​ టీమ్​కు సారథిగా ప్రస్తుత దక్షిణాఫ్రికా టీమ్​ కెప్టెన్​ డికాక్​ ప్రాతినిధ్యం వహించనున్నారు.

ఇదీ చూడండిత్రీటీ క్రికెట్: ఒకే మ్యాచ్​లో మూడు జట్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.