ETV Bharat / sports

నేటి నుంచే విజయ్​ హజారే ట్రోఫీ- వీరికి కీలకం

మరో దేశవాళీ క్రికెట్​ టోర్నీకి రంగం సిద్ధమైంది. విజయ్​ హజారే ట్రోఫీ నేడే ప్రారంభం కానుంది. మెరుపులు మెరిపించేందుకు కుర్రాళ్లు ఉత్సాహంగా ఉన్నారు. ఇంగ్లాండ్​తో పరిమిత ఓవర్ల సిరీస్​లో చోటు కోసం సీనియర్లతో పోటీ పడనున్నారు. ఈ టోర్నీలో సత్తా చాటి జాతీయ జట్టులోకి రావాలని ఊవిళ్లూరుతున్నారు. సయ్యద్​ ముస్తాక్​ అలీ టోర్నీ ఛాంపియన్​ తమిళనాడు సహా ముంబయి, బెంగళూరు, దిల్లీ బలంగా కనిపిస్తున్నాయి.

Shreyas Iyer, Shikhar Dhawan among big-shots eyeing impactful show in Vijay Hazare Trophy
విజయ్​ హజారే ట్రోఫీ వీరికి ఎంతో కీలకం!
author img

By

Published : Feb 20, 2021, 5:35 AM IST

దేశవాళీ క్రికెట్​ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ నేడే ప్రారంభం కానుంది. కిందటేడాది కరోనాతో వాయిదా పడగా.. ఇప్పుడు బయోబబుల్​ వాతావరణంలో నిర్వహించనున్నారు. ఇటీవలే సయ్యద్​ ముస్తాక్​ అలీ టీ-20 టోర్నీ విజయవంతం కావడంతో.. దీనిపై ఆసక్తి నెలకొంది.

సూరత్​, ఇందోర్, బెంగళూర్, జైపుర్, కోల్​కతా, తమిళనాడులోని ఆరు వేదికల్లో ఈ టోర్నీ జరగనుంది. జట్లను 5 ఎలైట్ గ్రూప్​లు, ఒక ప్లేట్​ గ్రూప్​గా విభజించారు. క్వార్టర్​ ఫైనల్​ మార్చి 8, 9 తేదీల్లో జరగనుంది. సెమీఫైనల్ మార్చి 11న, ఫైనల్​ మ్యాచ్​ మార్చి 14న నిర్వహించనున్నారు.

ఇంగ్లండ్​తో సిరీస్​ కోసం..

జాతీయ జట్టులో చోటు కోసం కుర్రాళ్లకు చక్కటి వేదిక ఈ టోర్నీ. భారత్​- ఇంగ్లాండ్​ వన్డే, టీ-20 సిరీస్​ నేపథ్యంలో.. సెలక్టర్లను ఆకర్షించేందుకు అన్​క్యాప్డ్​ ప్లేయర్లు, టీమ్​ఇండియాలో తిరిగి చోటు కోసం ఇప్పటికే ఆడిన ఆటగాళ్లు, తమను తాము నిరూపించుకోవడానికి సీనియర్లు సిద్ధంగా ఉన్నారు. శనివారం నుంచి ప్రారంభం కానున్న విజయ్​ హజారే ట్రోఫీలో సత్తా చాటడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

సయ్యద్​ ముస్తాక్​ అలీ ఛాంపియన్​ తమిళనాడు.. అదే ఊపులో విజయ్​ హజారేను ఒడిసిపట్టాలని పట్టుదలగా ఉంది. ఈ టోర్నీలో విజయవంతమైన జట్టు కూడా తమిళనాడే. 5 సార్లు టైటిల్​ విజేతగా నిలిచింది.

డిఫెండింగ్​ ఛాంపియన్​ కర్ణాటక సహా ముంబయి, దిల్లీ, పంజాబ్​ కూడా బలంగానే కనిపిస్తున్నాయి.

శ్రేయస్​, ధవన్​, భువీ..

ఇప్పటికే పరిమిత ఓవర్ల ఫార్మాట్లో టీమ్​ఇండియాకు ఆడుతున్న శ్రేయస్​ అయ్యర్​ ముంబయి జట్టుకు కెప్టెన్​గా ఉన్నాడు. జాతీయ జట్టులో పోటీ పెరిగిన నేపథ్యంలో.. తనను తాను నిరూపించుకునేందుకు ఇది మరో అవకాశం. అదే జట్టులోని మరో ఆటగాడు సూర్యకుమార్​ యాదవ్​కు భారత జట్టులో చోటు దక్కే అవకాశాలు అధికంగా ఉన్నందున.. శ్రేయస్​కు ఇది కీలకం కానుంది. పృథ్వీ షా కూడా ఈ టోర్నీలో ఉత్తమ ప్రదర్శన చేస్తే టీమ్​ఇండియాలో మళ్లీ చోటు దక్కే అవకాశాలు లేకపోలేదు.

గాయం కారణంగా.. జాతీయ జట్టుకు కొంత కాలంగా ఆడని పేసర్​ భువనేశ్వర్​ కుమార్​ ఉత్తర్​ప్రదేశ్​ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. ఇందులో సత్తా చాటి ఇంగ్లాండ్​తో సిరీస్​కు ఎంపిక కావాలని ఆశిస్తున్నాడు. తన స్థానంపై అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో.. శిఖర్​ ధవన్​(దిల్లీ) కూడా రెచ్చిపోవాలని భావిస్తున్నాడు.

తమిళనాడు జట్టుకు సారథ్యం వహిస్తున్న దినేశ్​ కార్తీక్​ ఈ టోర్నీలో తనను తాను నిరూపించుకోవాల్సి ఉంటుంది. ముస్తాక్​ అలీ టోర్నీలో టైటిల్​ అందించినా.. వ్యక్తిగతంగా పెద్దగా రాణించలేదు. టీమ్​ఇండియాలో వికెట్​ కీపర్​గా చోటు సంపాదించుకునేందుకు అతడు కష్టపడాల్సిందే.

బరోడా కెప్టెన్​ క్రునాల్​ పాండ్య సహా సయ్యద్​ ముస్తాక్​ అలీ టోర్నీలో నాకౌట్​ చేరిన హరియాణా, రాజస్థాన్​, బెంగాల్​ ఆటగాళ్లు కూడా జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించాలని ఊవిళ్లూరుతున్నారు. అందుకోసం.. ఈ ట్రోఫీలో రాణించేందుకు సిద్ధమవుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.