ETV Bharat / sports

కరోనాపై పోరుకు రూ.50 లక్షలు ప్రకటించిన సచిన్​​ - కరోనా విరాళాలు

కరోనా నియంత్రణకు రూ.50 లక్షల విరాళాన్ని ప్రకటించాడు భారత మాజీ క్రికెటర్​ సచిన్​ తెందుల్కర్​. వైద్య పరికరాల కొనుగోలు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెరో రూ.25 లక్షల సహకారాన్ని అందించాడు.

Sachin Tendulkar donates Rs 50 lakh to fight COVID-19
కరోనాపై పోరుకు రూ.50 లక్షలు ప్రకటించిన సచిన్​​
author img

By

Published : Mar 27, 2020, 1:05 PM IST

కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి కావాల్సిన వైద్య పరికరాలు కొనుగోలు చేసేందుకు దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు తమ సహకారాన్ని అందిస్తున్నారు. ఈ పోరాటంలో భాగంగా రూ.50 లక్షలను తన వంతు విరాళంగా ప్రకటించాడు భారత దిగ్గజ క్రికెటర్​ సచిన్​ తెందుల్కర్​.

"కొవిడ్​-19కు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో భాగం కావాలనుకున్నా. అందుకే నా వంతుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెరో రూ.25 లక్షలు విరాళాన్ని ప్రకటిస్తున్నా."

- సచిన్​ తెందుల్కర్​, టీమిండియా మాజీ క్రికెటర్​

పఠాన్​ సోదరులైన ఇర్ఫాన్, యూసుఫ్ 4 వేల మాస్క్‌లను బరోడా పోలీసులకు, ఆరోగ్య విభాగానికి విరాళంగా ప్రకటించారు. టీమిండియా మాజీ కెప్టెన్​ మహేంద్ర సింగ్ ధోని రూ.1 లక్ష విరాళం ఇచ్చాడు.

భారతదేశంలో ఇప్పటివరకు 724 మందికి కరోనా వైరస్​ సోకగా.. 17 మంది మృతి చెందారు. ఈ మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా 24 వేలకు పైగా మరణాలు సంభవించాయి.

ఇదీ చూడండి.. క్రికెటర్ల ఫొటోలతో బీసీసీఐ కరోనా సూచనలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.