ETV Bharat / sports

'రసెల్​ను మించిన ఆల్​రౌండర్ లేడు' - ఆండ్రూ రసెల్ తాజా వార్తలు

ప్రస్తుత క్రికెట్​లో వెస్టిండీస్ ఆటగాడు ఆండ్రూ రసెల్​ను అత్యుత్తమ ఆల్​రౌండర్​గా చెప్పుకొచ్చాడు కోల్​కతా నైట్​రైడర్స్ యువ ఆటగాడు రింకూ సింగ్. రసెల్ కంటే బంతిని బలంగా బాదేవారు ఎవరూ లేరని తెలిపాడు.

Russel is the best all rounder in the world says Rinku SIng
'రసెల్​ను మించిన ఆల్​రౌండర్ లేడు'
author img

By

Published : Sep 17, 2020, 7:30 AM IST

ప్రస్తుత క్రికెట్‌లో ఆండ్రూ రసెల్​ను మించిన అత్యుత్తమ ఆల్‌రౌండర్‌ ఎవరూ లేరని అంటున్నాడు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఆటగాడు రింకూసింగ్‌. రసెల్‌ కంటే బంతిని బలంగా బాదేవారు ఎవరూ లేరని.. అతడికి చాలా శక్తి ఉందన్నాడు. సిక్సర్లు కొట్టడంలో ఇప్పడు అతడితో పోటీ పడగలిగే ఆటగాడిని తాను చూడలేదని చెప్పాడు. ప్రపంచంలో ప్రస్తుతం అతడే అత్యుత్తమ ఆల్‌రౌండర్ అన్నా డు.‌

"నేను రసెల్​తో ఎక్కువగా మాట్లాడలేదు. నాకు ఇంగ్లీషులో మాట్లాడటం అంతగా రాదు. కానీ ఓసారి అతడి పుట్టినరోజు సమయంలో మా గదిలో అందరం కలిసి సంబరాలు చేసుకున్నాం. డ్యాన్సులు చేశాం. అప్పటి నుంచే మా మధ్య స్నేహం పెరిగింది. నేను కోల్‌కతా జట్టుకు ఆడటాన్ని ఎంతగానో ఆస్వాదిస్తున్నా. ఈ అనుభవం చాలా గొప్ప అనుభూతిని ఇస్తోంది. చాలా విషయాలు నేర్చుకున్నా. లెజండరీ క్రికెటర్లతో ఆడగలిగే అవకాశం నాకు దక్కింది. మ్యాచ్‌లో ఎలా వ్యవహరించాలన్న పరిణతీ పెరిగింది."

-రింకూ సింగ్, కేకేఆర్ ఆటగాడు

22 ఏళ్ల రింకూ సింగ్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు 2018 నుంచి పాతినిధ్యం వహిస్తున్నాడు. దేశవాళీ క్రికెట్‌లో తనకంటూ మంచి పేరు సంపాందించుకున్న రింకూ..‌ ఉత్తర్‌ప్రదేశ్ తరపున ఎన్నో అత్యుత్తమ ప్రదర్శనలు చేశాడు. 2018-19 రంజీ సీజన్‌ గ్రూప్ దశలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు.

ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌ 2020 సీజన్‌ ఈ నెల 19న ప్రారంభం కానుంది. కోల్‌కతాతో పాటు టోర్నీలో పాల్గొనే అన్ని జట్లు తీవ్రంగా సాధన చేస్తున్నాయి. మొదటి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబయి ఇండియన్స్‌తో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తలపడనుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.