ETV Bharat / sports

రోహిత్‌కు పరీక్ష?.. యోయో టెస్ట్​లో పాసైతేనే

author img

By

Published : Nov 13, 2020, 8:43 AM IST

ఐపీఎల్​లో గాయపడిన రోహిత్​ శర్మ.. ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్​ సిరీస్​కు ఆడుతాడా లేదా అన్నది అనుమానంగానే ఉన్నది. ప్రస్తుతం అతడు పూర్తి ఫిట్​నెస్​ సాధించడానికి దుబాయ్​ నుంచి ఎన్​సీఏలోని పునరావాసానికి వెళ్లనున్నాడు. దీని తర్వాత యోయో టెస్టులో పాసైతేనే హిట్​మ్యాన్​కు టెస్ట్​లో ఆడే అర్హత లభిస్తుంది. మరి ఏమి జరుగుతుందో చూడాలి.

Rohith
రోహిత్

కరోనా మహమ్మారి నేపథ్యంలో అసలు జరుగుతుందా? లేదా? అన్న దశ నుంచి ఊహించనంత స్థాయిలో విజయవంతమైంది ఈసారి ఐపీఎల్‌. ఆటగాళ్లతో పాటు ప్రపంచ క్రికెట్లో ఐపీఎల్‌ జోష్‌ తీసుకొచ్చింది. అయితే ఆస్ట్రేలియా పర్యటనకు ముందు టీమ్‌ఇండియాకు కొంచెం నష్టం కూడా కలిగించింది. దాదాపు రెండు నెలల మెగా ఈవెంట్లో కొందరు కీలక ఆటగాళ్లు గాయపడటం టీమ్‌ఇండియాకు దెబ్బే. మరీ ముఖ్యంగా రోహిత్‌శర్మ గాయం జట్టుకు భారీ నష్టమే. టీమ్‌ఇండియా పరిమిత ఓవర్ల జట్లకు వైస్‌ కెప్టెన్‌ కూడా అయిన రోహిత్‌ గత కొన్నేళ్లుగా మూడు ఫార్మాట్లలో టీమ్‌ఇండియాకు కీలక ఆటగాడిగా మారాడు. వన్డేల్లో టీమ్‌ఇండియాకు ఓపెనర్‌గా మారినప్పటి నుంచి అతడి ఆటే మారిపోయింది. టీ20, వన్డేల్లో రోహిత్‌ ఎక్కువ సేపు క్రీజులో ఉంటే మ్యాచ్‌ టీమ్‌ఇండియాదే అన్న అభిప్రాయం బలపడింది. అయితే ఐపీఎల్‌లో తొడ కండరాల గాయం నేపథ్యంలో రోహిత్‌కు తొలుత టీమ్‌ఇండియా మూడు జట్లలోనూ చోటు దక్కలేదు.

బీసీసీఐ వైద్య బృందం అంచనాలను తలకిందులు చేస్తూ అనుకున్న సమయం కంటే ముందే రోహిత్‌ ఫిట్‌గా తయారయ్యాడు! ముంబయి ఇండియన్స్‌కు అయిదోసారి ఐపీఎల్‌ ట్రోఫీ అందించాడు. ఆసీస్‌ పర్యటనలో ఆడాలన్న పట్టుదలే రోహిత్‌ను ఫిట్‌గా మార్చేసి ఉంటుంది! అయితే ఫిట్‌నెస్‌ విషయంలో బీసీసీఐ ప్రమాణాలు వేరు.. ఫ్రాంచైజీ అనుసరించే పద్ధతులు వేరు! బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)లో యోయో పరీక్ష పాసైన ఆటగాళ్లకే భారత జట్టులో చోటు దక్కుతుంది. అత్యుత్తమ ఫీల్డర్‌గా పిలుచుకునే సురేశ్‌ రైనా సైతం యోయో పరీక్షలో విఫలమై గతంలో జట్టులో చోటు కోల్పోయాడు.

యోయో టెస్ట్​ పాసైతేనే

రోహిత్‌ విషయంలోనూ బీసీసీఐ ఈ సూత్రాన్ని అమలు చేయొచ్చు. రోహిత్‌ తనకు తాను ఫిట్‌ అని ప్రకటించుకున్నా పూర్తిస్థాయిలో సంతృప్తి చెందని బీసీసీఐ వన్డేలు, టీ20లకు అతడికి విశ్రాంతినిచ్చింది! టెస్టులకు సిద్ధమయ్యేందుకు రోహిత్‌కు 15 రోజుల గడువు కూడా ఇచ్చింది! ఐపీఎల్‌ ముగియగానే జట్టంతా ఆస్ట్రేలియాకు పయనమవగా.. రోహిత్‌ నేరుగా ఎన్‌సీఏకు చేరుకున్నాడు! డిసెంబరు 17న అడిలైడ్‌లో తొలి టెస్టు ప్రారంభమవుతుంది. నిబంధనల ప్రకారం ఆసీస్‌లో అడుగుపెట్టిన వాళ్లకి 14 రోజుల క్వారంటైన్‌ తప్పనిసరి. తొలి టెస్టు ఆడాలంటే కనీసం 2, 3 రోజుల ముందు నుంచి జట్టుకు అందుబాటులో ఉండాలి. అంటే ఈనెలాఖరు లోపు అక్కడికి చేరుకోవాలి. ఎన్‌సీఏలో మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ సాధించిన తర్వాత యోయో పరీక్షలో రోహిత్‌ పాసైతేనే ఇవన్నీ జరుగుతాయి. పే

సర్‌ ఇషాంత్‌శర్మదీ అదే పరిస్థితి. ఐపీఎల్‌లో గాయానికి గురైన ఇషాంత్‌ ప్రస్తుతం ఎన్‌సీఏలో ఉన్నాడు. టెస్టు జట్టులో చోటు సంపాదించిన ఇషాంత్‌ గాయం నుంచి కోలుకుని, మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ సాధిస్తే ఆసీస్‌కు బయల్దేరతాడు. వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా ఫిట్‌నెస్‌పై స్పష్టత లేదు. ఐపీఎల్‌ మ్యాచ్‌లో సాహా రెండు తొడ కండరాలకు గాయాలయ్యాయి. టెస్టుల్లో టీమ్‌ఇండియాకు సరైన వికెట్‌ కీపర్‌గా పేరు తెచ్చుకున్న సాహా కోసం చివరి వరకు ఎదురు చూడాలని బీసీసీఐ భావిస్తుంది. అందుకే అతడిని జట్టు నుంచి తొలగించలేదు. మరో వికెట్‌ కీపర్‌తో అతడి స్థానాన్ని భర్తీ చేయలేదు. ఇక అంతర్జాతీయ అరంగేట్రం చేయకుండా స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తికి గాయం అడ్డుపడింది. భుజం గాయం కారణంగా టీ20 జట్టులో స్థానం కోల్పోయాడు.

ఇదీ చూడండి : 'రోహిత్​ కెప్టెన్​ కాకపోతే టీమ్​ఇండియాకే నష్టం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.